NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam: సౌర్య ఎవరో తెలుసుకున్న సౌందర్య.. నిరూపమ్. కాలర్ పట్టుకున్న జ్వాల..!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో జ్వాలకు అసలు నిజం చెప్పాలని నిరూపమ్ అనుకుంటాడు. కానీ జ్వాల మాత్రం తన రక్తంతో నిరూపమ్ బొమ్మ గీసి తన మనసులో ఉన్న ప్రేమను ఎమోషనల్ అవుతూ నిరూపమ్. కు చెప్పడంతో నిరూపమ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగిందనే చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్ లో జ్వాల డాక్టర్ సాబ్ కి నా మనసులో మాట చెప్పేసాను. ఇక మా పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే అంటూ హిమకు చెబుతుంది. అందుకు హిమ కూడా సరే అని అంటుంది.

హిమకు క్యాన్సర్ లేదని అసలు నిజం చెప్పిన డాక్టర్ :

సీన్ కట్ చేస్తే సౌందర్య హిమ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. మా మనవరాలు ఎంత చెప్పినా మా మాట వినడం లేదు.. మీరయినా తన ఫైల్ చూసి తన ఆరోగ్యం ఎలా ఉందో కొంచెం చూసి చెప్పండి అంటుంది.ఆ తరువాత డాక్టర్ హిమ గురించి మాట్లాడుతూ తను నాకు బాగా తెలుసు.ఆమెకు అసలు కాన్సర్ లేదు.. ఈ మందులు కూడా బలానికి వాడే మందులు అని చెప్పడంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.మా మనవరాలు మా దగ్గర ఎందుకు అబద్దం చెబుతుంది డాక్టర్ అంటుంది సౌందర్య ఆశ్చర్యంగా.హిమకు కాన్సర్ లేదు.. మొన్న కూడా మా హాస్పిటల్ కు వచ్చి ఎవరికో రక్తం అవసరం అంటే ఇచ్చి వెళ్ళింది అని చెప్పడంతో మరోసారి షాక్ అయ్యి హిమ అలా ఎందుకు చేసిందా అని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌందర్య.

శోభకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హిమ :

ఇక శోభ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ హిమ ఉండడం చూసి షాక్ అవుతుంది. ఆ తరువాత శోభ, హిమల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక శోభ.. హిమ బ్యాక్ గ్రౌండ్ అంతా చెప్పడంతో హిమ శోభ పీక పట్టుకొని నా ఫ్యామిలీ గురించి మాట్లాడకు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఆ తరువాత శోభ కూడా జ్వాలానే సౌర్య అని అలాగే నీకు క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ఉంది అని డ్రామా ఆడావు అనే విషయాలు నాకు తెలుసు. ఇవన్నీ బయట పెడితే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకో అని అనడంతో హిమ షాక్ అవుతుంది.ఇక హిమ వెళ్ళేటప్పుడు కాస్త వెటకారంగా నవ్వుతూ నీ పని చెప్తా అన్నట్టు చూస్తూ అక్కడ నుంచి వెళ్లి పోతుంది.

హిమ చెంప పగలకొట్టిన సౌందర్య:

మరొకవైపు సౌందర్య, హిమ ఇంటికి రావడంతోనే హిమ చంప పగలగొడుతుంది. ఇంతలో అక్కడికి ఆనంద్ రావ్ అక్కడికి వచ్చి ఎందుకు సౌందర్య హిమను కొడుతున్నావు అని అంటాడు.అప్పుడు సౌందర్య అసలు విషయం చెప్పడంతో ఆనంద్ రావ్ షాక్ అవుతాడు. ఇంతలోనే అక్కడికి నిరపమ్, స్వప్న వస్తారు..ఈ విషయం తెలిసి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

నిరూపమ్ కాలర్ పట్టుకున్న జ్వాల :

ఇక రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, జ్వాలతో నిన్ను ప్రేమించడం లేదు అంటూ గట్టిగా కోపంగా చెబుతాడు. పాపం జ్వాల నిరూపమ్. మాటలు విని ఎంతో ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ నిరూపమ్ కాలర్ పట్టుకుంటుంది. ఇదంతా చాటుగా సౌందర్య, హిమ వింటూ ఉండగా అప్పుడు హిమ అసలు నిజం నానమ్మకు చెప్పడంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఇద్దరి మనవరాళ్లలో సౌందర్య నిరూపమ్ ను ఎవరికీ ఇచ్చి పెళ్లి చేస్తుందో చూడాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu