NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవాని దేవికి ఎదురు తిరిగిన రేవతి.. కృష్ణ మురారిల ముందుకి దేవ్.. ముకుంద కొత్త స్కెచ్..?

Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights

Krishna Mukunda Murari :ముకుంద భవాని తో తన స్క్రీన్ ప్లే స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కృష్ణ ఇంటికి వెళ్లారని తెలుసుకున్న ముకుందా నా పెళ్లి జరగడానికి ఇంట్లో ఎవరు సహకరించడం లేదు. ఒక్క భవాని అత్తయ్య తప్ప. ఇప్పుడు తను కూడా నా చెయ్యి దాటి పోకుండా ఉండాలంటే నా యాక్షన్ లో ఇంకాస్త స్పీడ్ పెంచాలి అని అనుకుంటుంది. భవాని రెడీ అయ్యి కిందకి రాగానే వీళ్లంతా ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు ముకుందా ఏడుస్తూ అసలు ఈ పెళ్లి జరుగుతుందని నాకు నమ్మకం లేదు అత్తయ్య. ఇంట్లో అందరూ ఆ కృష్ణకి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏమైనా తప్పు చేస్తున్నాను అత్తయ్య. నా వైపు ఇంట్లో వాళ్ళందరూ నీచంగా చూస్తున్నారు. నేనేమైనా తప్పు చేస్తే మీరు ఊరుకోరు కదా, నన్ను చంపేస్తారు కదా అని భవానిని ఇంప్రెస్ చేసే లాగా ముకుందా మాట్లాడుతుంది.

Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights
Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights

అత్తయ్య నాకు ఈ కేసులు ఏమీ అక్కర్లేదు అత్తయ్య నాకు మురారికే పెళ్లి జరిపించండి చాలు జీవితాంతం ఇలా మీ కాళ్ళ దగ్గర పడుంటాను అని భవాని కాళ్లు పట్టుకొని ముకుందా ఏడుస్తుంది. నీకు అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. అయినా నాకు మీరున్నారు కదా అత్తయ్య ఆ ధైర్యం నాకు చాలు అని ముకుందా అంటుంది. మీరు లేకపోతే నేనెప్పుడో చనిపోయేదాన్ని మీరు ఉన్నారన్న ధైర్యంతోనే బతుకుతున్నాను అని అంటుంది ముకుందా, భవాని దేవిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది.

Madhuranagarilo December 21 2023 Episode 241: బాబుని చూడాలంటే నీ రెండో భార్యకు విడాకులు ఇవ్వాలంటున్న రుక్మిణి..

Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights
Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights

ఇక ఇంట్లో వాళ్ళందరూ కృష్ణ ఇంటికి వెళ్లారని ముకుంద ద్వారా తెలుసుకున్న భవాని ఇక కృష్ణ ఇంటికి కోపంగా వెళ్తుంది. అప్పటికే కృష్ణ ఇంట్లో అందరూ సరదాగా, కృష్ణని ఆట పట్టిస్తూ గన్ పట్టుకునే వాడి చేత గరిట పట్టించావు అని మురారి వంట చేయడం చూసి ఇంట్లో అందరూ కృష్ణని ఆటపట్టిస్తూ ఉంటారు. మీరంతా అలా మాట్లాడేటట్టు అయితే ఇకనుంచి వెళ్ళండి అని అంటుంది కృష్ణ మేమిద్దరం వెళ్ళిన తర్వాత మీరిద్దరూ రొమాన్స్ చేసుకుంటూ టిఫిన్ తిందాం అనుకుంటున్నారా అంటూ మధు కూడా ఆటో పట్టిస్తాడు ఇక అందరూ సంతోషంగా సరదాగా, మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక అందరూ నవ్వుతుంటే, భవాని దేవి అక్కడికి వస్తుంది వాళ్ళని చూసి ఎందుకు అందరూ ఇంతను సరదాగా నవ్వుకుంటున్నారు స్టాపిట్ అని గట్టిగా అరుస్తుంది ఏంటి ఇదంతా రేవతి అని సీరియస్గా అడుగుతుంది ఈ నవ్వులు ఏంటి ఎందుకు ఇంత ఆనందం అని అడుగుతుంది ఇక అందరూ ఒక్కసారిగా భవాని దేవిని చూసి లేచి నిలబడతారు. మన ఇంట్లో ఒక అమ్మాయి తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడి ఉంది ఆ విషయం మీకు తెలుసా అని అంటుంది. లేదంటే కావాలని మీరందరూ కలిసి అమ్మాయిని చంపేయాలనుకుంటున్నారా అని రేవతి తో సీరియస్ గా, అయినా మనకి ఇల్లు లేదా ఈ ఇంట్లో పడి తినడం ఏంటి అని భవాని దేవి చీదరింపుగా మాట్లాడుతుంది కృష్ణుని చూస్తూ కృష్ణ ఏదో మాట్లాడబోతుంటే అసలు దోషాలు ఎవరూ పట్టుకునే వరకు భార్యాభర్తలు గా ఉండమని చెప్పాను కదా ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అని ప్రశ్నిస్తుంది ఒక్కసారిగా తాను చెప్పేది వినమని అంటుంది కృష్ణ అయినా నేను ఎవరు చెప్పింది వినాల్సిన అవసరం లేదు అని అంటుంది

Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights
Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights

భవానీ దేవి. మురారి కూడా నేను చెప్పేది ఒకసారి వినండి పెద్దమ్మ అని అంటాడు. ఈ కేసు నేను గాలికి వదిలేస్తే మీరు నాకు ముకుంద నుంచి పెళ్లి చేస్తారు కదా మరి నేను ఈ కేసు వదిలేసి రిలాక్స్ గా ఎలా ఉంటాను అని అంటాడు. నేను కేసును వదిలిపెట్టలేదు పెద్దమ్మ అని అంటాడు. ఇదేనా మురారి నువ్వు అర్థం చేసుకున్నది అని అంటుంది భవాని దేవి. ఇక కృష్ణ అసలు నేరస్థులు ఎవరో తెలిసే టైం దగ్గర పడితే అప్పుడు అంతా అర్థమవుతుంది అని అంటుంది. భవాని దేవి నా కావాల్సింది కూడా అదే మీరు నేరం చేశారని విషయం బయటకు పడితే అందరికీ మంచిది దాని కోసమే నేను తొందర పడుతున్నాను అని అంటుంది. అయినా ఎవరికి వారు సంతోషంగా ఉంటున్నారు ముకుంద గురించి ఆలోచించట్లేదని మీరు అనుకుంటున్నారు కదా అని అంటుంది కృష్ణ. అనుకోవడమేమి జరుగుతుంది కూడా అదే కదా ఆలోచిస్తే ఈ జాతర ఏంటి ఈ నవ్వులేంటి అని అంటుంది భవాని దేవి సీరియస్ గా. ఏసీబీ సారు రమ్మన్నా కూడా నేను ఆ ఇంటికి రావట్లేదు ఎందుకో తెలుసా నన్ను చూసిన ప్రతిసారి ముకుందా కోపంతో రగిలిపోయి ఏదైనా పిచ్చి పని చేసుకుంటుందని నేను ఇక్కడే ఉన్నాను. ఆయన రమ్మన్నా నేను రావట్లేదు రాకపోవడానికి నాకేమైనా పిచ్చా అని అంటుంది. పిచ్చి కాదు రేపటి రోజున మీరే దోషులను తెలిస్తే నేనేం చేస్తాను అన్న భయం మీకు అని అక్కడి నుంచి భవాని దేవి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక వెనకాలే భవానీ దేవితో పాటు రేవతి కూడా వెళ్తూ మీరు భోజనం చేసి రండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది.

Brahmamudi December 22 2023 Episode 285: అరుణ్ కి షాక్ ఇచ్చిన స్వప్న..పద్మావతి అనుమానం..? హల్ది సంబరాలు.. అప్పు కి అవమానం..

Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights
Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights

ఇక భవానీ దేవి ముకుంద మాటలు గుర్తు చేసుకుంటూ ముకుంద తన కాళ్ళ మీద పడి, తన పెళ్లి జరిగేలా చూడమని భజన అడ్డం గుర్తుకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ముకుంద బాధపడడంలో అర్థం ఉంది ఇంట్లో ఇలా ఉంటే వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా అని అనుకుంటుంది రేవతి ఇంట్లోకి వస్తే ఏంటి అప్పుడే వచ్చేసావు కాసేపు అంతరిక్షంలో ఆడుకొని రాకపోయావా అని అంటుంది భవాని దేవి కోపంగా రేవతి తో, అక్కడ ఉండి వస్తే తప్పేంటి అక్క అని అంటుంది రేవతి సీరియస్గా ఆ పిల్లలతో అలా ఉంటే నష్టం ఏంటని రేవతి ఎదురు తిరిగి మాట్లాడుతుంది భవాని దేవికి నష్టం ఏంటో ఇందాకే చెప్పాను కదా అని అంటుంది భవాని దేవి. కానీ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఏం చేస్తారు అని అంటుంది భవాని దేవి ముకుందా ముకుందా ఏంటక్కా ఈ ముకుందా ఇప్పటికే రెండుసార్లు చావు డ్రామా ఆడింది మర్చిపోయావా అని అంటుంది రేవతి భవాని దేవితో, ముకుంద పడే బాధ నీకు డ్రామాలా అనిపిస్తుందా అని అంటుంది భవాని దేవి. కృష్ణ తో పాటు తిరిగేసరికి నీకు కూడా దానిలానే మైండ్ మారిపోయిందా అసలు ఆ పిల్ల ఎంత బాధ పడుతుందో మీకు తెలుసా అని అంటుంది. రేవతి మానంగా ఉండేసరికి ఏంటి మాట్లాడవు అని అడుగుతుంది ఏంటి మాట్లాడేది మీరు నాతో మాట్లాడాలన్నా నేను మీతో మాట్లాడాలన్న ముఖం మీద జాలి చూపించాలి అది నాకు ఇష్టం లేదు నాకు నా బిడ్డ జీవితం ముఖ్యం వాడు కోరుకునే అమ్మాయి ముఖ్యం ఎవరో ఒక నీళ్లు పెట్టుకుంటారని ఇంకెవరో జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. కృష్ణ గురించి మురారి ఆలోచిస్తున్నాడు. మురారి గురించి నేను ఆలోచిస్తున్నాను నాకు వాళ్ళ జీవితమే ముఖ్యం అని తెగేసి చెబుతుంది రేవతి. ఎవరు ఆ కృష్ణ జీవితం నాశనం చేయలేదు తన జీవితాన్ని తనే పాడు చేసుకుంది అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights
Krishna Mukunda Murari Today Episode December 22 2023 Episode 347 Highlights

నీ బిడ్డ చనిపోయినట్లు అనాధ శవాన్ని పంపిన వాళ్లు నీకు ఇష్టమా నీ బిడ్డ చనిపోలేదు బతికే ఉన్నాడని తీసుకొని చూపించిన వాళ్ళు అంటే నీకు ఇష్టం లేదా అని అంటుంది. హాస్పటల్లో వాన్ని చూపించి మనకి ముకుంద ఎంత హెల్ప్ చేసిందో నీకు తెలియదా తను గనుక చూపించకపోతే ఇప్పటికీ మనం మురారి కోసం వెతుక్కుంటూనే ఉండే వాళ్ళం కాదా అని అంటుంది. అదంతా జరిగింది సరే, కానీ నేరం చేయని వాళ్ళని కూడా చేశారని మీరు ఇప్పుడు నువ్వు ఒక నిర్ధారణకి వచ్చేస్తే ఎలా అక్కా అని అంటుంది అంటే ఇప్పటికీ నువ్వు కృష్ణ వాళ్ళు మోసం చేశారంటే నమ్మకు లేకపోతున్నావా రేవతి అని అంటుంది. నేనైతే నిజంగా నమ్మట్లేదు అక్క ఒకవేళ అదే నిజమై తెలిస్తే నేనే వాడి చేత విడాకులు పేపర్స్ మీద సాయం చేయించి వాడి మెడ పట్టుకొని, బయటికి గెంటేస్తాను అని అంటుంది ఇదే మాట మీద ఉంటావా అని అడుగుతుంది రేవతి ఉంటాను అక్క మీరు కూడా దీని వెనుక కృష్ణ లేదని తెలిస్తే వాళ్ళ బంధం శాశ్వతం చేస్తారా అని అంటుంది చూస్తా అంటే చూస్తారా చేస్తారా అని అంటుంది. నేను తొందరపడి మాట ఇవ్వను ఇచ్చాను అంటే దానిమీద నిలబడతాను. అయినా నీకు చెప్తున్నాను కదా ఖచ్చితంగా ముకుంద కి న్యాయం చేయడం కోసం నేను ఎక్కడ దాకైనా వెళ్తాను అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భవాని దేవి. రేవతి ఆలోచిస్తూ ఇవాళ కాకపోతే రేపైనా కృష్ణ నిజాయితీ నీకు తెలుస్తుంది అక్క అని అనుకుంటుంది.

Malli Nindu Jabili December 21 2023 Episode 526: ఐ క్యు న్యూస్ ఛానల్ సీఈఓ గౌతమ్ నందని అరెస్టు చేయించిన ధర్మారావు..

ఇక శకుంతల కృష్ణ జీవితం ఏమైపోతుందో అని బాధపడుతూ మధు వాళ్ళు సర్దు చెబుతూ ఉంటారు. కృష్ణ కేమీ కాదు కృష్ణ తప్పు చేసిందని ఎవరు నమ్మట్లేదు కదా, మీరు ధైర్యంగా ఉండండి అని శకుంతలకి ధైర్యం చెబుతూ ఉంటారు. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ముకుంద వస్తుంది ముకుంద రాగానే అందరూ మౌనంగా ఉంటారు ఏంటి అందరూ ఇప్పటిదాకా బానే మాట్లాడారు కదా ఇప్పుడేంటి ఆపేశారు అని అంటుంది ముకుందా, అప్పుడే అక్కడికి దేవ్ వచ్చి ముకుందా అని పిలుస్తాడు వెనక్కి తిరిగి ముకుందా దేవుని చూసి షాక్ అవుతుంది వీడేంటి నిజంగా మన ఇంటికి వచ్చేసాడు అంటుంది ఎవరండి మీరు అని అడుగుతుంది రేవతి. ఇక దేవుని పరిచయం చేస్తుంది ముకుంద మా అన్నయ్య అని చెబుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ముకుంద దేవ్ నీ తీసుకొస్తుంది. దేవ్ తన అన్నయ్య అని మురారి కి ముకుంద పరిచయం చేస్తుంది. దేవ్ మురారి తో నాకు ముకుంద ఎంతో కృష్ణ కూడా అంతే అని అంటాడు. ఇక మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu