(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికాలో భారత సంతతి సిక్కు పోలీసు అధికారిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన సందీప్ సింగ్ ధలివాల్(42).. అమెరికాలో ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సందీప్ సింగ్.. ఓ కారును ఆపాడు. అయితే అందులో ఓ వ్యక్తి, మహిళతో కలిసి ఉన్నాడు. అయితే కారును ఆపిన వెంటనే అందులో ఉన్న ఆ వ్యక్తి.. కిందకు దిగి సందీప్ సింగ్‌పై కాల్పులకు దిగడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. కాల్పులు జరిపిన దుండగుడు.. వెంటనే అక్కడి నుంచి సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌లోకి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. షాపింగ్ మాల్‌లోకి పరారైన దుండగుడిని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఉన్న మహిళను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సందీప్ సింగ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Officer Dhaliwal was the first Sikh in Texas to wear his turban while on duty. Earlier today, he was tragically shot and killed in the line of duty. My deepest condolences to his family, friends, and fellow officers. Rest In Peace, Sandeep. https://t.co/A8ko0mmMpT
— Senator John Cornyn (@JohnCornyn) September 28, 2019
సందీప్ సింగ్ ధలివాల్ మరణంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని టెక్సాస్ పోలీసులు గుర్తు చేసుకున్నారు. టెక్సాస్ పోలీస్ విభాగంలో ధలివాల్ మొదటి సిక్కు డిప్యూటీ అని.. విధుల్లో కూడా తలపై పాగాతోనే ఉండేవాడని పోలీస్ అధికారి గాంజలేజ్ తెలిపారు. గత పదేళ్లుగా టెక్సాస్ పోలీస్ డిపార్ట్మెంట్లో ధలివాల్ పనిచేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు. ధలివాల్ చాలా మంచి పోలీస్ ఆఫీసర్ అని, అతడికి తన సిక్కు కమ్యూనిటీ అంటే ఎంతో గౌరవమని చెప్పారు. తన కమ్యూనిటీకి గౌరవంగా విధుల్లో కూడా ఎప్పుడు తల పాగాతోనే ఉండేవాడని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తోపాటు పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు.
This video captures the essence of who Deputy Dhaliwal was. He touched countless of lives along the way. A legacy that will never be forgotten. We will aspire to be as good as he was. #HouNews #lesm https://t.co/c3i2eBBLMv
— Ed Gonzalez (@SheriffEd_HCSO) September 28, 2019