20,000 లీగ్స్ అండర్ ద సీ సినిమా పోస్టర్
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సముద్రగర్భంలో చిమ్మచీకట్లో హఠాత్తుగా ఒక పొడవాటి తొండం లాంటి ఆకారం ప్రత్యక్షం. ఇదేంటా అన్న ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే మరిన్ని టెంటకిల్స్ ప్రత్యక్షం. చూస్తుండగానే కళ్ల ముందు భారీ ఆక్టోపస్, పొడవాటి తొండాల లాంటి చేతులు మెలికలు తిరుగుతూ కొన్ని క్షణాలు మెరుపులా మెరిసి తర్వాత మాయం.
అమెరికా జాతీయ సముద్ర వాతావరణ పరిశోధనా సంస్థ వారు, సముద్రగర్భ జీవులపై చీకటి ప్రభావం తెలుసుకునేందుకు పంపించిన ఒక జలాంతర్గామిలోని సిబ్బంది అనుభవం ఇది. ఏమిటి ఇందులో అంత విశేషం? విశేషమే. ఎందుకంటే శతాబ్దాలుగా మానవుల ఊహాశక్తికి పని పెట్టిన ఈ వింతజీవిని సహజస్థితిలో వీడియో తీయడం ఇదే మొదటిసారి. దీని పొడవు సుమారుగా 12 అడుగులు ఉంటుంది.
Big…or maybe we should say "giant" news! A few days ago, we posted about how Journey into Midnight expedition team was hunting for giant squid in Gulf of Mexico. Well, they found one… Take a break from #Okeanos live video for the full story: https://t.co/HAdRebectL pic.twitter.com/6cNVH2b0IM
— NOAA Ocean Exploration (@oceanexplorer) June 21, 2019
ఆక్టోపస్‌కు ఎనిమిది చేతులు ఉంటాయి. తొండాల్లాగా చూడానికే చిత్రంగా ఉంటాయి. ఇవి కాక టెంటకిల్స్ అనే రెండు పొడవాటి సున్నితమైన హస్తాలు ఉంటాయి. మరే జంతువుకూ లేనంత పెద్ద కన్ను ఉంటుంది. వంట్లో రక్తం నీలం రంగులో ఉంటుంది. అన్ని జీవులకూ ఒక గుండె అయితే దీనికి లోపల మూడు గుండెలు ఉంటాయి. జూల్స్ వెర్న్ 1870లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ‘20,000 లీగ్స్ అండర్ ద సీ’లో ఇట్లాంటి జెయింట్ ఆక్టోపస్ ఒకటి ఏకంగా జలాంతర్గామినే చుట్టేస్తుంది. తర్వాత ఈ నవల సినిమాగా కూడా తీశారు.
ఈ రూపాన్ని రాక్షస ఆకారంలో ఊహించుకోండి చూద్దాం. అదే మన జలాంతర్గామి సిబ్బందికి కనబడింది. ఈ జీవులు కనబడటమే కష్టం. ఇప్పటివరకూ చనిపోయిన జెయింట్ ఆక్టోపస్ కళేబరాలు ఒడ్డుకు కొట్టుకువస్తే చూడడం, లేక స్పెర్మ్ తిమింగలం కడుపులో కనబడితే చూడడం. అంతే. ఇన్నాళ్లకు ఒక రాక్షస ఆక్టోపస్ వీడియో కెమెరాకు చిక్కింది. కొద్ది క్షణాలు అయితే మాత్రమేం. దీనిని చూసి శాస్త్రవేత్తలు పండగ చేసుకుంటున్నారు.