(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
న్యూజిలాండ్‌లో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సమీప ప్రాంతంలో ఉన్న సుమారు 50 మందిలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జరిగింది. వైట్ ఐలాండ్ లోని ఈ అగ్నిపర్వతం పేలుడుకు ముందు కొందరు పర్యటకులు దాని సమీపంలో నడుస్తూ కనిపించారు.
My god, White Island volcano in New Zealand erupted today for first time since 2001. My family and I had gotten off it 20 minutes before, were waiting at our boat about to leave when we saw it. Boat ride home tending to people our boat rescued was indescribable. #whiteisland pic.twitter.com/QJwWi12Tvt
— Michael Schade (@sch) December 9, 2019
వాకారి అని స్థానికంగా పిలిచే వైట్ ఐలాండ్ న్యూజీలాండ్‌లో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఇదొకటి. అయినప్పటికీ.. ఈ అగ్నిపర్వత దీవిని సందర్శించటానికి రోజూ పర్యటకులు వస్తుంటారు. పగటి పూట పర్యటనలతో పాటు విహంగ విహారాలు కూడా ఉంటాయి. ప్రతి ఏటా పది వేల మందికిపైగా పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు.
ఈ దీవి నుంచి వెనుదిరిగి వస్తున్న సమయంలో మైఖేల్ షేడ్ అనే పర్యటకుడు.. అగ్నిపర్వతం విస్ఫోటనాన్ని వీడియో తీశారు. ఈ వీడియోలో పర్వతం పైభాగాన దట్టమైన బూడిదతో నిండిన పొగ కనిపిస్తోంది. మరి కొందరు పర్యటకులు తమను రక్షించటం కోసం ఆ దీవిలో వేచి ఉండటం కూడా కనిపించింది. ఇప్పటి వరకు 23 మందిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు.
Checked photo timestamps. Last photo from me standing on the land was 13:49; this first photo of the eruption was 14:12, about a minute or two into the eruption. pic.twitter.com/hyqQuO4vNq
— Michael Schade (@sch) December 9, 2019
Those are some of the people put boat picked up. Praying for them and their recovery. Woman my mom tended to was in critical condition but seemed strong by the end.
The helicopters on the island looked destroyed: pic.twitter.com/jds5QBD1yg
— Michael Schade (@sch) December 9, 2019