(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎవరికైనా జీవితంలో ఒకే ఒక్క అవకాశం దొరుకుతుంది అంటారు చూడండి. ఈ ఫొటో అలాంటిది. ఈ అత్యద్భుతమైన ఫొటో తీసింది చేజ్ డెక్కర్ అనే ఫోటోగ్రాఫర్. మెరైన్ బయాలజిస్ట్ అయిన డెక్కర్కు వన్య ప్రాణుల ఫొటోలు తీయడం హాబీ. గత వారం కాలిఫోర్నియా తీరంలో మాంటరీ అఖాతంలో తిమింగలాలను ఫొటోలు తీసేందుకు వెళ్లినపుడు ఈ దృశ్యం అతని కంట పడింది.
తిమింగలం దవడల మధ్య చిక్కుకున్న సీలయన్ ఫోటో చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు. సీలయన్ దానికి భోజనం అయిందనుకుంటారు. కానీ అక్కడ జరిగింది అది కాదు.
డెక్కర్కు సముద్రంలో తిమింగలాల గుంపు కనబడింది. అవి యాంఖోవీ చేపల సమూహాలను ఫలహారం చేస్తున్నాయి. సడన్గా సీలయన్ ఒకటి ఒక తిమిగలం నోట చిక్కింది. వెంటనే డెక్కర్ తన కెమెరాకు పని చెప్పాడు. ఈ అద్భుతమైన చిత్రం చిక్కింది.
ముందే అనుకున్నట్లు ఫోటో చూస్తే సీలయన్కు రోజులు చెల్లాయని అనుకుంటాం. కానీ తిమింగలం దవడలు మూసుకోకముందే సీలయన్ జారి పోయింది. బతుకు జీవుడా అనుకుంటూ సముద్ర జలాల్లో మాయమయింది.
సీలయన్ను తిమింగలం మింగేస్తున్నట్లున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://www.instagram.com/p/B0TrbRmgiKt/?utm_source=ig_web_copy_link