ప్రతి పక్షి జత కట్టే ముందు గూడు కట్టుకుంటుంది. తరవాత జత కట్టి గుడ్లు పెడుతుంది
అది ప్రకృ తి సహజం
గూడు కట్టడం రాని చిలక చెట్టు తొఱ్ఱలలో గుడ్లు పెడుతుంది
ఒక్క కోయిలకి మాత్రం మహా బద్దకం
హాయిగా తోటల్లో తిరుగుతూ ఉండక వెధవ గూడు ఎవరు కడతారు అనుకుంది
పైగా తను బాగా కూస్తానని అహంకారం
కాకి కోయిల ఒకేలా ఉండడం కాకి ఖర్మ
కోయిలతన గుడ్లు కాకి గూట్లో పెట్టి వెళ్లిపోతుంది
దానికి నేను కార్పొరేట్ పక్షి అని పేరు పెట్టేను
కాకికి పాపం లెక్కలు రావు అందుకే కాకిలెక్కలు అంటారు
కాకి వాటిని పొదిగి పిల్లల్ని చేస్తుంది తిండి పెట్టి పెంచుతుంది
కాకౌ కాకః పికౌ కాకః
వసంతకాలే సంప్రాప్తే
కా కౌ కాకః. పికౌ పికః
కాకీ నలుపే కోయిలా నలుపే వసంతకాలం వస్తే కాకి కాకే కోయిల కోయిలే
అంచేత ఆపిల్లలు కూతకి రాగానే అందులో కొన్ని తన పిల్లలు కావని తెలిసి వాటిని తరిమేస్తుంది
మనుషుల్లో కూడా కార్పొరేట్ కోయిలలు ఉన్నారు
లేటెస్ట్ ట్రెండ్ చూద్దాం
ఉద్యోగాలు చేసే అమ్మాయిలు అదే జీవితం అనుకుంటున్నారు
పిల్లల్ని కనడానికి పెంచడానికి వాళ్ళకి టైము ఓపిక లేవుట
వీకెండ్లో పార్టీలకి సినిమాలకి టైము ఉంటుందిట
తొమ్మిది నెలలు మోసి oh horrible
ప్రసవవేదన పడి I can’t imagine
పిల్లల్ని కనాలా నావల్ల కాదు
పోనీ ఎవరినైనా పెంచుకో. No I don’t like it
మరెలా, ఏవుందీ మన విత్తనం మరో చోట పాతడవే
వైద్యపరంగా ప్రొగ్రెస్, నైతికంగా అన్యాయం అక్రమం
డబ్బుతో కొనలేనిది ఏదీ లేదని మరోసారి రుజవు అయింది
చాలామంది పిల్లల్ని కంటున్నారు. కానీ వాళ్ళ సమస్య డబ్బు
దాన్ని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావు
ఒకప్పుడు డాక్టర్ నీ విత్తనాన్ని టెస్ట్ ట్యూబ్ లో పెట్టి నీ గర్భ సంచిలో పెడతాడు
అది కేవలం శారీరకలోపాలు ఉన్నవాళ్ళకి మాత్రమే
కానీ పిల్లలు కనడం ఇష్టం లేనివాళ్లు దాన్ని మరొకరి గర్భంలో పెట్టిస్తారు
ఆవిడ పాపం తొమ్మిది నెలలు మోసి కని నీకు ఇస్తుంది
అఫ్ కోర్స్ నువ్వు ఆవిడకి కూలి బాగానే ఇస్తావు
నీదగ్గర డబ్బు ఉంది. ఆవిడ దగ్గర గర్భసంచి ఉంది
ఇదొక రకం వ్యాపారం
సృష్టిని వ్యాపారంగా మార్చేస్తున్నారు
నీకు పిల్లని కన్న తల్లిని సర్రోగేట్ మదర్ అంటారు
అచ్చ తెలుగులో అద్దె తల్లి
ఆవిడ ప్రతి క్షణం ఈపిల్ల నాది కాదు అనుకోవాలి
యెంత దారుణం
నువ్వు గణించిన డబ్బు గుణించడానికి ఓ పిల్ల ఉండాలని మరొకరి గర్భం అద్దెకి తెచుకుంటావా
ఆలా తెచ్చుకున్న పిల్లల్ని నేను చూసేను
ఆతల్లికి పిల్లకి అనుబంధం సహజంగా లేదు
ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మరోటి వచ్చింది
సర్రోగసికి పరాకాష్ట
కొంతమంది లైం లైట్లో ఉన్న డబ్బున్నవాళ్ళు పెళ్లి చేసుకోరుట
వాళ్ళ ఆర్జన ఏవౌతుంది, పిల్ల కావాలి
సర్రోగసి ద్వారా పిల్లని కంటున్నారు
మరి ఆపిల్లకి తల్లి ఉండదు తండ్రి ఉండదు
వాళ్ళకి జవాబు ఏవిటి చెప్తారు
ఇవి జవాబులేని ప్రశ్నలు
ఇన్నాళ్ళకి పేపర్లో మంచి వార్త చూసేను
Commercial surrogacy to be banned
పెళ్లి ఐన ఐదేళ్లవరకు పిల్లలు లేకపోతె అప్పుడు సర్రోగసి ద్వారా పిల్లని కనొచ్చు
కానీ ఆ సర్రోగేట్ మదర్ వాళ్ళ రెలటివ్ అయిఉండాలి
ఇలా చాల షరతులు ఉన్నాయి
నిరుడు రాజ్యసభ ఒప్పుకోలేదుట
ఈసారి ఒప్పుకుంటుందని ఆశిద్దాం
Best of luck
-బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ