బిగ్ బాస్ 4 : “నువ్వెవ్వడు నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి?” అభిజిత్ కి కోపం వస్తే మామూలుగా లేదు

Share

బిగ్బాస్ ఎలాంటి హై వోల్టేజ్ రియాలిటీ గేమ్ షో లో వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మాటలతోనే యుద్ధ వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. ఇక బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో పెట్టే స్పెషల్ రూల్స్, సీక్రెట్ టాస్క్ లు మరింత టెంపర్ రైజ్ చేస్తూ ఉంటాయి. అయితే నాలుగో సీజన్ ఇంటిలో ఉన్న కంటెస్టెంట్ లలో ఎప్పుడూ లేని విధంగా అభిజిత్, అమ్మరాజశేఖర్ మధ్య కూడా గొడవ జరుగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో బాగా వైరల్ అవుతుంది.

 

గడిచిన 56 రోజుల లో బిగ్ బాస్ షో లో అనేక గొడవలు జరిగాయి కానీ వాటిలో ఏ నాడు అభిజిత్ అమ్మరాజశేఖర్ మధ్య మనస్పర్థలు రాలేదు. కానీ వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ఊహకందని స్థాయిలో ఉన్నట్లు అర్థమవుతోంది. అభిజిత్ చాలా కూల్ గా కనిపిస్తాడు. ఏదైనా మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుని తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ ఎన్నడూ లేని విధంగా అభిజిత్ కి కూడా ఒక్కసారిగా టెంపర్ లేవడంతో ఈరోజుటి ఎపిసోడ్ రసవత్తరంగా ఉండబోతోందని తెలుస్తోంది.

అమ్మ రాజశేఖర్ మామూలుగానే క్షణికావేశానికి గురి అయ్యే వ్యక్తి. ఇక అతనికి ఏ మాత్రం తీసిపోని విధంగా అభిజిత్ వాదన ఉంది. కష్టపడి పైకి వస్తే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది అని మాస్టర్ అన్నప్పుడు ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు అని అభిజిత్ అన్నాడు. అంత కష్టం ఇంత కష్టం అని అనడంలో అసలు అర్థం లేదని వాష్ రూమ్ లో అభిజిత్ అరిచేశాడు. దానికి మాస్టర్ నువ్వేమి కష్టపడుతున్నావ్ కుర్చీలో కూర్చొని ఉంటావు అంతే అది అభిజిత్ కి మరింత మండింది. నా ప్రవర్తన గురించి మీరు ఎవరు డిసైడ్ చేయడానికి అని మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా ఇద్దరికీ ఆగ్రహావేశాలు తారాస్థాయికి చేరడంతో ఈరోజుటి ఎపిసోడ్ పైన భారీ ఆసక్తి నెలకొంది.


Share

Related posts

వైభ‌వంగా `వ‌ర‌ల్డ్ ఫొటోగ్ర‌పీ డే` ఉత్స‌వాలు

Siva Prasad

నా ల‌వ‌ర్ క్రికెట‌ర్ కాదు: తాప్సీ

Siva Prasad

Ruby Roman: ఈ గ్రేప్స్​ మస్త్‌‌ కాస్ట్‌‌లీ..!! ఎందుకంటే..

bharani jella