టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ, పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లు వేస్తూ ఎంతో చలాకీగా అందరిని ఆకట్టుకుంటూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. బ్రహ్మాజీ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండి తన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో తన అభిమానులను మరింత ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా తన మీద వచ్చే రూమర్లను, గాసిప్ లపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటిని తిప్పి కొడుతుంటాడు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ వేసిన సెటైర్ కి బ్రహ్మాజీ దీటైన సమాధానం చెప్పాడు. బ్రహ్మాజీ వేసే సెటైర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ కరోనా కష్టకాలంలో ఎంతోమంది సెలబ్రెటీస్ వారికి తోచిన సాయం చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అవడమే కాకుండా, వారికి సహాయం చేసి ఎంతో పెద్ద మనసును చాటుకున్నారు. ఇలా సహాయం చేయడంలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ప్రతి ఒక్కరూ వారికి తోచిన సహాయం చేస్తూ, కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.
ఇందులో ముఖ్యంగా బండ్లగణేష్, మంచు మనోజ్ ఎవరైనా సహాయం చేయమని అడిగితే వారు అడిగే సాయంలో నిజాయితీ ఉంటే అలాంటివారికి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ బ్రహ్మాజీని ఆట పట్టించడానికి సరదాగా ”బ్రహ్మాజీ అన్న.. నాకు ఒక మంచి క్రికెట్ బ్యాట్ కొనివ్వు అన్నా” అంటూ ట్వీట్ చేశాడు.
అందుకు బ్రహ్మాజీ స్పందిస్తూ, ఇందులో ఒక మంచి బ్యాట్ ను సెలెక్ట్ చేసుకో అంటూ కొన్ని బ్యాట్ ఎమోజిస్ ని పంపించాడు. బ్రహ్మాజీ చేసిన రీ-ట్వీట్ కు సదరు నెటిజెన్ ఎంతో ఆశ్చర్యపోతూ మీమ్స్‌తో రచ్చ రచ్చ చేశారు. ఇంకొకసారి ఎప్పుడు బ్రహ్మాజీ అన్నతో పెట్టుకోకండి అంటూ సెటైర్లు వేశారు. మరికొందరైతే.. ఏంటి? ”సోనూ సూద్” అనుకున్నారా? అడగాన్నే ఇవ్వడానికి.. ఇక్కడ ఉన్నది బ్రహ్మాజీ!” అంటూ కామెంట్ చెయ్యగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.