Keto Diet: కీటో డైట్ గురించి విన్నారా..!? ఇలా పాటించాలి..!!

Share

Keto Diet: బరువు తగ్గడానికి చాలా రకాల డైట్స్ అందుబాటులోకి వచ్చాయి.. కానీ ఈ మధ్య బాగా పాపులర్ అయిన డైట్.. కీటో డైట్.. అంటే కీటో జెనిక్ ఫుడ్ అని అర్థం..  కీటో డైట్  పాటిస్తే కొవ్వు దానంతటదే కరిగిపోతుంది.. ఇందులో కార్బోహైడ్రేట్స్ ను పూర్తిగా తొలగిస్తారు.. అసలు కీటో డైట్ అంటే ఏమిటి..!? ఎలా పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం..!!

How to Follow the Keto Diet:
How to Follow the Keto Diet:

Keto Diet: కీటో డైట్ అంటే..

మన శరీరం శక్తిని రెండు రూపాల్లో తీసుకుంటుంది. ఒకటి మనం తినే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు గ్లూకోజ్ గా మార్చి ఆ శక్తిని ఉపయోగించుకుంటుంది.. మరొకటి ఫ్యాట్.. సాధారణంగా మన శరీరం గ్లూకోజ్ నే శక్తి రూపంలో తీసుకునేందుకు మక్కువ చూపిస్తుంది.. అందువలన కొవ్వు త్వరగా కరగదు.. అయితే కీటో డైట్ లో కేవలం ఫ్యాట్ మాత్రమే కలిగి మన శరీరానికి శక్తి అందుతుంది గ్రూప్ కోసం శరీరం ఏమాత్రం తీసుకోదు.. మనం గ్లూకోజ్ తయారు చేసుకునే ఆహారాన్ని అస్సలు తీసుకోము ఈ డైట్ లో.. కేవలం ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన కొవ్వును తప్పనిసరిగా శక్తి రూపంలో మార్చుకుంటుంది.. ఈ శక్తి కిటోన్ అనే కణాల రూపంలో ఉంటుంది. దీని వలన కొవ్వు త్వరగా తగ్గుతుంది.. దీంతో సులువుగా బరువు తగ్గుతారు..

How to Follow the Keto Diet:
How to Follow the Keto Diet:

కీటో డైట్ లో పిండి పదార్థాలను 15 శాతం, కొవ్వు పదార్థాలను 65 శాతం, ప్రోటీన్ లను ఒక మోస్తరు లో తీసుకోవాలి. అయితే మొదటి రోజు నుంచే కార్బోహైడ్రేట్స్ నీ ఒక్కసారిగా 20 గ్రాములకు తగ్గించి తీసుకుంటే శరీరం ఇబ్బందికి గురి అవుతుంది. అందువలన ఒక్క రోజులో కాకుండా ఒక వారం రోజుల సమయంలో కొద్ది కొద్దిగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించుకుంటూ రావాలి. ఇలా వారం రోజులు తరువాత పూర్తిగా కీటో డైట్ లో కి మారాలి.

How to Follow the Keto Diet:
How to Follow the Keto Diet:

కీటో డైట్ ను ఇలా ప్రారంభించండి..!!

మొదటి రోజు ఉదయం  బ్రష్ చేయని ఒక గ్లాసు నీళ్ళలో అర చెక్క నిమ్మరసం పిండుకుని తాగాలి. దీని తరువాత అర గంట వరకు ఏమి తీసుకోకూడదు. 30 నిమిషాల తర్వాత ఒక కప్పు బ్లాక్ కాఫీ లేదా టీ తాగాలి. 11 గంటలకు రెండు గంటలు నాన పెట్టిన ఉదలు, సామలు, కొర్రలు తో అన్నం వండుకొని, ఒక కప్పు మోతాదు అన్నం మాత్రమే తీసుకోవాలి. ఒక కప్పు అన్నం, ఒక కప్పు కూర మాత్రమే తినాలి. నాన్ వెజ్ తినేవారు ఉడికించిన గుడ్డును తినవచ్చు. కూర కలుపుకొని అన్నం తినగా,  అన్నం మిగిలితే పల్చని నీళ్ళ లాంటి మజ్జిగతో అన్నం కలుపుకుని తినవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు 7 బాదం పప్పులు, వాల్ నట్స్, కీరదోస కాయను తినవచ్చు. వీటితో పాటు ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. రాత్రి 7 గంటలకు ఉదయం తీసుకున్న కొర్రలు, సాములు, ఊదలతో తయారు చేస్తున్న ఒక కప్పు అన్నాన్ని తినాలి. రాత్రి 10:30 గంటల వరకు పచ్చి మంచినీళ్లు తప్ప ఇంకేమి తినకూడదు తాగకూడదు.

How to Follow the Keto Diet:
How to Follow the Keto Diet:

రెండవ రోజు మొదటిరోజు పాటించిన విధంగానే డైట్ ను తీసుకోవాలి. మూడవరోజు కూడా మొదటి రోజు పాటించిన విధంగానే తీసుకోవాలి. కాకపోతే రాత్రిపూట తీసుకుని చిరుధాన్యాల అన్నన్ని అరకప్పు మోతాదుగా తగ్గించాలి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే కూరను ఎక్కువగా తీసుకోవాలి. నాలుగో రోజు కూడా మూడో రోజు మాదిరిగానే డైట్ పాటించాలి. ఐదో రోజు రాత్రిపూట పూర్తిగా చిరుధాన్యాలు అన్నాన్ని తీసుకోవడం మానేయాలి. ఒట్టి కూర , గుడ్డు, పల్చని మజ్జిగ తీసుకోవాలి. ఆరో రోజు కూడా 5వ రోజు లాగానే తీసుకోవాలి. ఇక ఏడో రోజు పూర్తిగా చిరుధాన్యాలతో తయారు చేసుకునే అన్నం తినడం మా చిరుధాన్యాల అన్నం స్థానంలోకి కీటో డైట్ కి సంబంధించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఏడో రోజు నుంచి మీరు పూర్తిగా కీటో డైట్ లో కి మారిపోతారు. నెమ్మదిగా కార్బోహైడ్రేట్స్ ని తగ్గించుకుంటూ తీసుకోవడం వల్ల శరీరం నెమ్మదిగా ఇబ్బంది లేకుండా ఈ కొత్త డైట్ ను ఆహ్వానిస్తుంది. అయితే మనం మీరు ఈ ఏడు రోజులు చేసింది బరువు తగ్గడానికి కాదు. మన ఆహార శైలీని మార్చుకోవడానికి మాత్రమేనని గుర్తుంచుకోవాలి. కీటో డైట్ లో కోడిగుడ్లు, చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, కిడ్నీ, లివర్, నెయ్యి, కొబ్బరి నూనె, పన్నీర్, వెన్న, చీజ్, పాల మీద మీగడ వంటి హైట్ డైట్ మాత్రమే తీసుకోవాలి.


Share

Related posts

బిగ్ బ్రేకింగ్ : Ys Sharmila వైయస్ షర్మిల దీక్షా ప్రాంగణంలో వైయస్ వివేకానంద రెడ్డి కూతురు..!!

sekhar

బ్రేకింగ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ అప్డేట్…! రేపు బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ లైవ్ లో ….

arun kanna

బాబ్రీ కేసులో తుది తీర్పు..! బీజేపీ నేతలకు ఊరట

Special Bureau