కాజల్ అగర్వాల్ 14 సంవత్సరాల క్రితం లక్ష్మీ కళ్యాణం అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో లక్ష్మీ పాత్రలో అచ్చు తెలుగు అమ్మాయిగా, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తన 14 సంవత్సరల సిని ప్రస్థానంలో ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, బాలీవుడ్ చిత్రాలలో ప్రముఖ హీరోల సరసన నటించింది.
లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు లేకపోవడంతో విరామం తీసుకున్న కాజల్ అగర్వాల్, ఎటువంటి హంగామా లేకుండా నిశ్చితార్థం చేసుకుందని వార్తలు వినిపించాయి. అయితే బంధువులు, స్నేహితులు లేకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కాజల్ అగర్వాల్ నిశ్చితార్థ వేడుక జరిగింది.
అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పెళ్లి గౌతం అనే బిజినెస్ మ్యాన్ ని చేసుకోబోతున్నారు. ఇక నిన్న కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి హింట్ ఇవ్వగా ఈరోజు పెళ్లి ఎప్పుడో కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించేసింది. ఈ నెల అంటే అక్టోబర్ 30 వ తేదీన అతికొద్దిమంది మధ్య పెళ్లి నిరాడంభరంగా జరగనుందని ఆమె ప్రకటించింది.
ఇక కాజల్ అగర్వాల్ పెళ్లి అని ప్రకటించగానే అభిమానులందరూ ఒక్కసారిగా తీవ్ర నిరాశకు గురయ్యారు. పెళ్లి తర్వాత కాజల్ కూడా సమంతల సినిమాలలో నటిస్తుందా? లేదా అనే విషయం క్లారిటీ లేకపోయినప్పటికీ ఆమె అభిమానులు అంత కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏంటి కాజు పాప.. నువ్వు పాలరాతి బొమ్మలా ఉన్నావ్.. నీ భర్త ఏంటి అలా ఉన్నాడు ? ఇంతకంటే అందగాడు నీకు దొరకలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం కాజల్ కి సరిగ్గా సరిపోయే జోడీలే ఇద్దరు బాగున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. వీరి ఇద్దరి వివాహం ముంబైలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతుందని సమాచారం.