NewsOrbit
Featured టాప్ స్టోరీస్ ట్రెండింగ్

నవ్వుకోండి..! మగాళ్ళకి ఓ రోజుందోయ్..! ఎలా వాడుకుంటున్నారంటే..!?

ఏ రోజు..? “ఏ రోజో” తెలియడం లేదు..!!
ఏ రోజు..? “ఎవరి రోజో” తెలియడం లేదు..?
అందుకే ఆ రోజూ, ఈ రోజూ అని తేడా తెలీకుండా బతుకుతున్న మగాడికి “మగాడి రోజు” ఒకటుందని తెలిసింది..! పాపం.., ఇక్కడ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక మగాడి రోజుని, మగాడే నవ్వులపాలు చేసుకుంటున్నాడు. ఎవరూ తనకు శుభాకాంక్షలు చెప్పరని తెలుసు.., ఈ రోజు మళ్ళీ తనకు గుర్తుండదని తెలుసు..!! అందుకే పాపం మగాడు…, ఈరోజుని అన్ని రోజుల్లా కాకుండా తనకు తానే సెటైర్ వేసుకునే రోజుగా మార్చుకుంటున్నాడు..! మగాళ్ల దినం సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని సందేశాలు చూస్తే మొదట నవ్వు.., ఆపై “జాలిదినం” గానూ మారక మానదు.

ఈ దినం.. మా దినం…! తర్వాత బతుకంతా దీనం..!!

ప్రియమైన భార్యకు…!! నీ పురుష భర్త అయిన నేను రాసుకుంటున్నది ఈ ఒక్కరోజు
“పళ్ళు నూరొద్దు..
ఉరిమురిమి చూడొద్దు..
ఈ దినం మా దినం..
ఒదిలేయ్ ఈ ఒక్క దినం..
ఆ తర్వాత నా బతుకెలాగూ దీనం..
బతుకంతా నేను నీ అధీనం..

పాపం మగాడు..!!

* వాడు దేహ బలముందనీ విర్ర వీగుతాడు..! “ఆమె” మనో బలం ముందు ఓడిపోతాడు..!!
* “వాడు” ఒర లో కత్తు లెన్నో పెట్టుకుంటాడు..! “ఆమె” ఓర చూపు కు చిత్తై పోతాడు…!!
* “వాడు” మాటలెన్నో మాట్లాడుతాడు..! “ఆమె” మౌనానికి గిల గిల కొట్టుకుంటాడు ..!
* “ఆమె”ను కట్టడి చేసా ననుకుంటాడు..! నిజానికి “వాడే” బంధీనని తెలుసుకోలేడు..!
* మార్చి 8 కి కవితలెన్నో రాస్తాడు..! నవంబర్ 19 అంటే తెల్లమొహం పెడతాడు..!
* పాపం “వాడంతే” వాడికంటూ ఓ రోజుందని.., తెలియని.., “అమ్మా”యకుడు….! పాపం మగాడు…!

ఇదీ మగాళ్ల రోజున మగాళ్ళపై… మగాడే రాసుకున్న, వేసుకున్న బాణాలు.
(నోట్ ; ఇది సరదా కోసమే కానీ…)

1999 లో ఊపిరి…!

అసలు ఈ మగాళ్ల దినోత్సవం ఏమిటి..? చరిత్ర ఏమిటి అనే మూలాల్లోకి వెళ్తే..! దీన్ని 1999 నుండి జరుపుకుంటున్నారు. సమాజం, కుటుంబంపై పురుషుల బాధ్యతలకు గుర్తుగా ఒక రోజు ఉండాలని 1999 లో ట్రానిడాడ్ అండ్ టొబాకో లో మొదటిసారి జరుపుకున్నారు. ఆ తర్వాత ఐరాస ఆమోదంతో అన్ని దేశాల్లోనూ జరుపుతున్నారు. పురుషుల అనారోగ్య సమస్యలపై దృష్టి పెట్టడం.., లింగ్ వివక్ష పోగొట్టడం దీని ఉద్దేశాలు. నిజానికి 1960 నుండి రష్యాలో ఈ ప్రతిపాదన ఉంది. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున.. అయ్యో పురుషులకు ఒక రోజు ఉంటె బాగుంటుంది.., సమానత దెబ్బతింటుంది అంటూ సోవియట్ యూనియన్ కి చెందిన ఓ జర్నలిస్టు వ్యాసం రాశారు. దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అడపాదడపా చర్చలు మాత్రం జరిగేవి. కానీ 1991 లో మిస్సోరి విశ్వవిద్యాలయంలో థామస్ ఓస్టెర్ మళ్ళీ ఇదే తరహా ప్రతిపాదన తీసుకువచ్చారు. అలా 1992 నుండి ఫ్రిబ్రవరి 7 న పురుషులు ఏకమై.. కలిశారు. అలా అలా.. 1999 నాటికి పురుషుల దీనోత్సవంగా మారిపోయింది. నేటి సోషల్ మీడియా యుగంలో దీన్ని ఎలా వాడుకోవాలో తెలియక.. ఇదిగో ఇలా జరుపుకుంటున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri