బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెలలో స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరో సీజన్ కి సంబంధించి లోగో తో పాటు ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. విడుదలైన ప్రోమోలో నాగార్జున కనిపించడంతో.. మరోసారి ఆయనే హోస్ట్ గా రాణిస్తున్నట్లు తేలిపోయింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నుండి హోస్ట్ స్థానంలో నాగార్జునే ఉంటూ వస్తున్నారు. ఆరో సీజన్ కి కూడా ఆయనే కావటంతో దాదాపు వరుస పెట్టి నాలుగు సీజన్లకు హోస్ట్ గా రాణిస్తున్నట్లు తేలిపోయింది.
బిగ్ బాస్ షోలో ఒకపక్క ఎంటర్టైన్మెంట్ పండిస్తూనే మరోపక్క ఇంటి సభ్యులు ఎవరైనా తేడాగా హౌస్ లో వ్యవహరిస్తే అదే స్థాయిలో నాగార్జున రియాక్ట్ అవుతూ ఉంటారు. మంచి పని చేస్తే అందరి చేత శభాష్ అనిపించే తరహాలో అభినందించిన నాగార్జున… కొద్దిగా తేడాగా నెగిటివ్ గా ఏమైనా మాట్లాడిన ఇతరులతో వ్యవహరించిన ఇంటి సభ్యులకు అదే స్థాయిలో డోస్ నాగార్జున ఇస్తూ… చాలా అద్భుతంగా డీల్ చేస్తారు. ఈ క్రమంలో ఆరో సీజన్ కోసం నాగార్జున హోస్ట్ గా 15 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
కేవలం వీకెండ్ ఎపిసోడ్ లలో… శని ఆదివారాలలో మాత్రమే కనిపించే నాగార్జున ఈ రీతిగా రియాల్టీ షోకి… రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు రావడం సంచలనం సృష్టిస్తోంది. గత సీజన్ లో 12 కోట్ల రూపాయలు తీసుకోక ఈసారి మూడు కోట్ల రూపాయలు నాగార్జున డిమాండ్ చేసినట్లు..షో నిర్వాహకులు ఓకే చెప్పినట్లు టాక్. దాదాపు వచ్చే నెల నాలుగో తారీఖు నుండి బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ లో ఎవరు… ఎంతమంది పాల్గొంటారన్న విషయంపై ఎటువంటి ప్రకటన రాలేదు. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నయి.