Rohit Sharma: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ విజయవంతంగా రాణిస్తోంది. ఆదివారం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసి నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ కి దిగిన 50 ఓవర్ లలో నాలుగు వికెట్లకు 400 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 61, శుబ్ మాన్ గిల్ 51, విరాట్ కోహ్లీ 51… అర్థ సెంచరీలతో రాణించగా శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్ సెంచరీలతో పరుగుల బీభత్సం సృష్టించారు.

411 పరుగుల లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బుధవారం న్యూజిలాండ్ తో భారత్ సెమీఫైనల్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ… మొదటి నుండి దూకుడుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పరుగుల కంటే ప్రధానంగా బౌండరీలకు ప్రాధాన్యత ఇస్తూ బౌలర్ల పై రోహిత్ శర్మ విరుచుకుపడుతున్నారు. ఆదివారం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్థ సెంచరీ చేసిన రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ రికార్డులు నమోదు చేశారు.
అంతర్జాతీయ క్రికెట్ లో వంద ఆఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాదు వరుసగా రెండు వరల్డ్ కప్ టోర్నీలలో 500 కు పైగా పరుగులు చేయటం జరిగింది. ఒక్క వన్డే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు, అంతేకాదు ఒక వరల్డ్ కప్ లో ఎక్కువ సిక్సర్ లు బాదిన కెప్టెన్ గా నిలిచాడు. సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్ గా నిలిచాడు. అంతేకాదు బెంగళూరు చిన్న జీయర్ స్వామి స్టేడియంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా కూడా రోహిత్ రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.