యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితురాలే. తెలుగు టెలివిజన్ లో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించగా.. ఇటీవల ఆషో నుండి బయటకు వచ్చేయడం జరిగింది. దీంతో అనసూయ బయటకు రావడం పట్ల రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి అనసూయ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కష్టాలు గురించి వైరల్ కామెంట్ చేసింది.
పూర్తి విషయంలోకి వెళ్తే జబర్దస్త్ నుండి బయటకు రావడానికి కారణం తనపై బాడీ షేమింగ్, పంచ్ డైలాగులు వల్లే షో వీడిన్నట్లు తెలపటం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లను చిన్నచూపు చూస్తారని మరి ముఖ్యంగా హీరోయిన్ కష్టాలు మామూలుగా ఉండవని తనదైన శైలిలో వివరించింది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ప్రాధాన్యత తక్కువ. వాళ్లు కేవలం కెమెరా ముందు కాపాడండి లేదా సిగ్గుపడుతు నవ్వాలి. అదే మా పని. అసలు మాట్లాడకూడదు. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్ ఉంది కదా.. సేమ్ ఇక్కడ పరిస్థితి అలానే ఉంటుంది.
ఈ క్రమంలో ఎవరైనా ప్రశ్నిస్తే తమ హక్కుల కోసం మాట్లాడితే.. తొక్కేసే పరిస్థితి. ఒక విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే దేవదాసిలా పనిచేయాలి. ఇండస్ట్రీ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ రంగుల ప్రపంచం బయటకు కనిపించే అంత హుందాగా ఉండదు. సినిమా ఇండస్ట్రీ గురించి ముఖ్యంగా సినిమా నటీనటుల గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే.. జనాలు సినిమాలు చూడటం మానేస్తారు. అసలు మా సినిమాలు చూసే అర్హత మీకుందా అని మేం ఆలోచించడం మొదలు పెడితే.. ఎవరోస్తారు థియేటర్‌కి’ అంటూ అనసూయ తనదైన శైలిలో కామెంట్లు చేయడం జరిగింది.