మార్చి 22న రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదల కానుంది. సీనియర్ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఈ సినిమా ప్రధానంగా సాగుతుంది. నిజానికి చాలా ఇంటర్వ్యూస్ లక్ష్మీ పార్వతి చెబుతూ తాను ఎన్టీఆర్ వద్ద ఉన్నప్పుడే హరికృష్ణ రెండో భార్య షాలిని(జూనియర్ ఎన్టీఆర్ తల్లి), జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గరకు తీశానని చెప్పింది. అప్పట్లో జూనియర్ తనను నాన్నమ్మ అంటూ తిరిగేవాడని కూడా చెప్పుకొచ్చింది. అయితే సీనియర్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జూనియర్ తన పట్ల సరిగ్గా ప్రవర్తించలేదని కూడా చెప్పుకొచ్చింది. జూనియర్ సీనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఫోటోలను ఇంటి బయటకు వేసేశాడని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఆ సన్నివేశాన్ని రాంగోపాల్ వర్మ చిత్రీకరించాడట. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు చెప్పకుండా… ఓ పిల్లవాడు కన్నీటితో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ఫోటోను బయటకు వేయడం చూపిస్తారట. అయితే ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ సంతృప్తిగా లేడట. ఆ సీన్‌ను తొలగించాలంటూ.. రీసెంట్గా వై.ఎస్.ఆర్.సి.పి పార్టీలో చేరిన తన మామ నార్నే శ్రీనివాస్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి వర్మ దీనిపై ఏమంటాడో చూడాలి..
previous post
next post