(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మేఘాలయలో ఒక మ్యూజికల్ బ్యాండ్ పేరు మార్మోగుతోంది. విశేషం ఏమంటే అందులో ఉన్న అయిదుగురు యువకులూ అంధులు. ఈ బ్యాండ్ పేరు లైట్ ఆప్టర్ డార్క్.
ఈ కుర్రవాళ్లలో నలుగురు మొదట్లో స్కూల్ బ్యాండ్‌లో పాల్గొనేవారు. తర్వాత వారు జోమా సైలో అనే మ్యూజిక్ టీచర్‌ను ఆశ్రయించారు. అక్కడ వన్లామ్ఫ్రాంగ్ (వోకలిస్టు), రిమికి పజు (గిటారిస్ట్), దిల్బర్స్టార్ లింగ్డో (బాసిస్ట్), హిల్టర్ ఖోంగ్షై (డ్రమ్మర్) ప్రత్యేకమైన బ్యాండ్‌గా తయారయ్యారు. ఇటీవల అయిదవ సభ్యుడు ప్లమికి లాపశామ్ వారితో జత కలిశాడు.
ఇటీవలి ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల సంఘం వోటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలలో చైతన్యం కల్పించేందుకు ఈ బ్యాండ్ సేవలను ఉపయోగించింది. అప్పటి నుంచీ లైట్ ఆప్టర్ డార్క్కు గిరాకీ పెరిగింది. ఇప్పుడు నైట్ క్లబ్బులు, ఈవెంట్ మేనేజర్లు వారికోసం బారులు తీరుతున్నారు.
2015లో మేఘాలయ గాట్ టాలెంట్ అనే షోలో ఫైనల్స్‌కు వెళ్లన లైట్ ఆఫ్టర్ డార్క్ బ్యాండ్ ప్రదర్శన వీడియో ఇక్కడ చూడండి: