(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
నాలుగు పిల్లులు ఒక తాచుపాము పిల్లను చుట్టుముట్టాయి. కొద్ది క్షణాలు నువ్వా నేనా అన్నట్లు ఊగాయి. తర్వాత ఒక పిల్లి మాత్రం ధైర్యం చేసి పాము పడగపై తన కాలితో ఒక్కటిచ్చింది. దెబ్బకు పాము ధైర్యం సన్నగిలిపోయింది. వెంటనే బుసలు కొడుతూ బెదిరిస్తూ చిన్నగా చెట్ల పొదల్లోకి జారుకున్నది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోకు 98వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
సాహో సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ నీల్ నితిన్ ముకేష్ ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశారు.
https://www.instagram.com/p/B2Zg2kSH1Eu/