(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అబ్బాయిలు అమ్మాయిల డ్రెస్‌తో ఆలరించడం కొత్తేమీ కాదు. చాలా సినిమాలలో చూసిందే. అయితే ఇది మాత్రం కొత్తరకం వేషధారణ. అబ్బాయిలు పూర్తిగా అమ్మాయిల డ్రెస్ కాకుండా విచిత్రమైన వేషధారణతో డాన్స్ చేశారు. నడుం కింద పంచెను చీరలాగా చుట్టారు. నడుం పైన అచ్ఛాదన లేకుండా వదిలేశారు. పెద్ద పెద్ద నగలు ధరించారు. ఆపై నల్ల కళ్లద్దాలు పెట్టారు. పాపులర్ మళయాళీ పాటకు డాన్స్ చేశారు. ఓనం సందర్భంగా చేసిన ఈ సరదా పని వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఆఫీసులో మహిళా ఉద్యోగులు లేనపుడు, మీ మేనేజర్ ఓనం పండగ సంబరాలు చేయాల్సిందే అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అని చదివిన తర్వాత ఫేస్బుక్లో ఈ వీడియో చూడగానే జనం చక్కగా నవ్వుకుంటున్నారు.
https://www.facebook.com/cynthia.jobs/videos/10157850167846977/