(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
స్మార్ట్‌ఫోన్ అందరి జీవితంలో భాగమైపోయింది. మొబైల్ ఫోన్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన అరచేతిలోనే ఉందని నేటి యువత భావిస్తుంది. అలాంటి ఫోన్ నీటిలో పడితే ? సాధారణంగా నీటిలో ఫోన్ పడితే మళ్లీ పనిచేయదు. నీటిలో తడిస్తే ఫోన్ పాడయ్యే అవకాశాలే ఎక్కువ. అయితే, ఏడాది క్రితం నీటిలో పడిన ఓ ఐఫోన్ ఇంకా పనిచేస్తుంది. యూట్యూబర్ మైకేల్ బన్నెట్ అనే.. ఓ ట్రెజర్ హంటర్.. నదిలో పడిని వస్తువుల్ని వెతుకుతూ వుండగా… ఐఫోన్ కనిపించింది. అది ఇంకా పని చేయడం చూసి యూట్యూబర్ మైకేల్ బన్నెట్ షాక్ అయ్యాడు.
సౌత్ కరోలినాలోని ఎడిస్టో నదిలో ట్రెజర్ కోసం వెతుకుతూ ఉండగా.. ఐ ఫోన్ ని బన్నెట్ గుర్తించాడు. 15 నెలలుగా నీటిలో ఉన్న ఆ ఐఫొన్ ఇంకా పని చేస్తోందని వివరిస్తూ బన్నెట్ వీడియో తీశాడు. దాన్ని తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు. కొన్ని గంటల్లో దానికి లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. అంతేకాదు. ఆఫోన్‌ను జాగ్రత్తగా అతని ఓనర్‌కి అందించాడు. అది ఎరికా బెన్నెట్ అనే మహిళది. పోయిందనుకున్న ఫోన్ తిరిగి రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.