NewsOrbit
టాప్ స్టోరీస్

మహిళా పోలీస్ అధికారి గుండు కథ!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మహిళలకు పొడవాటి కురులే అందం. శిరోజాల విషయంలో వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఒకటి రెండు వెంట్రుకలు ఊడిపోయాయంటే తెగ బాధపడిపోతుంటారు. కానీ కేరళకు చెందిన ఓ పోలీసు అధికారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ మంచి పని కోసం ఏకంగా గుండు చేయించుకున్నారు. పోలీసు నిబంధనలు పక్కనపెట్టి ఆమె చేసిన ఈ పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.  క్యాన్సర్​ వ్యాధి బారిన పడి జుట్టునంతా పోగొట్టుకునేవారి పరిస్థితి ఊహించుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది. అందుకే త్రిశూర్ ​జిల్లా ఇరింజలకుడలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న పోలీస్​ అధికారిణి అపర్ణ లవకుమార్ గుండు కొట్టించుకుంది.

https://www.facebook.com/IjkVoice/videos/2405646869717128/

క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ డ్రైవ్‌లో​ భాగంగా స్థానిక పాఠశాలలో ఓ పదేళ్ల చిన్నారిని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఆమె తన ఉన్నతాధికారుల నుంచీ అనుమతి కూడా పొందింది. కిమోథెరపీ వల్ల చాలా మంది రోగులు జుట్టు కోల్పోయి బాధను అనుభవిస్తారు. అలాంటి వారికి అండగా ఉండేందుకు తన వెంట్రుకలను విగ్గు తయారు చేసేందుకు ఇచ్చారు. అపర్ణ లవకుమార్ తన మానవత్వాన్ని చాటిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అపర్ణకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

అందం అనేది బాహ్య సౌందర్యంలోనిది కాదని.. మనం చేసే ప్రతి పని, ప్రతి మాటలో కనిపించాలంటారు అపర్ణ లవకుమార్. గతంలో తమ చిన్నారికి చికిత్స చేయించాలని ఓ పేద కుటుంబం అపర్ణను ఆశ్రయించింది. వెంటనే తన చేతికున్న బంగారు గాజులను తీసి వారికి ఇచ్చారు.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment