(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పిడుగు పడితే పచ్చని చెట్టు కూడా భగభగా కాలిపోతుంది. అలాంటి పిడుగు మనిషిపై పడితే? వామ్మో ఇంకేమైనా ఉందా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే, అమెరికలో ఓ వ్యక్తి మాత్రం పిడుగు పడినా బతికే ఉన్నాడు. టెక్సాస్ లో అలెగ్జాండర్ కొరియాస్ అనే వ్యక్తి తన మూడు కుక్కలతో వాకింగ్ కి వెళ్లాడు. తిరిగి వస్తుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో అతను నేలకూలాడు. అది చూసిన స్థానికులు అతనికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం అతన్ని హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కొరియాస్ కోలుకుంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సిసి కెమెరాలోకి రికార్డు అయ్యాయి. ఈ సమయంలో పెద్ద కాంతి అతన్ని చుట్టుముంది. పిడుగు పడిన చోట భూమికి కన్నం పడినట్లు స్థానికులు తెలిపారు. ఆ వీడియోను ఓ వ్యక్తి తన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేయగానే అది వైరల్ అయ్యింది.
https://www.facebook.com/StuebnerAirlineVet/videos/383703092297486/