NewsOrbit
న్యూస్

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ వెనుక అంత పెద్ద వ్యక్తి ఉన్నాడా? కెసిఆర్ కు నిజంగానే ఇది బ్యాడ్ న్యూస్!!

తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎందుకు పెట్టబోతున్నారు ఆయనకు ఎవరి మద్దతు ఉంది అన్న చర్చలు మొదలయ్యాయి.

 

రాజకీయ పరిశీలకులు ఈ విషయమై ఆరా తీయగా ఆసక్తికరమైన సంగతి బయటకొచ్చింది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశం పార్టీ తోనే. టిడిపి అధినాయకుడు చంద్రబాబు నాయుడు ని రేవంత్ రెడ్డి రాజకీయ గురువుగానే చెప్పాలి. చంద్రబాబు కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న విషయం కూడా తెలిసిందే .తదుపరి పరిణామాల్లో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లారు .ఎంపీ అయ్యారు.

ఇప్పుడు ఆపార్టీలో అగ్ర నేతగానే ఉన్నారు.అయినప్పటికీ రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏ మాత్రం చెక్కుచెదర లేదంటారు . ఇప్పుడు కూడా అదే చంద్రబాబు నాయుడు రేవంతరెడ్డి చేత సొంత పార్టీ పెట్టించే పనిలో ఉన్నారట.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు చురుకుగా లేరు.తెలంగాణలో టిడిపి దాదాపు కనుమరుగైంది .పేరుకే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వారు కూడా టిడిపిలోనే కొనసాగుతారా అన్న అనుమానం. అయితే చంద్రబాబు మాత్రం కెసిఆర్ ని బద్ధ శత్రువుగా చూస్తున్నారు.

తన శిష్యుడి వేలితో నైనా కెసిఆర్ కంట్లో పొడవాలన్నది చంద్రబాబు వ్యూహం అంటున్నారు. రేవంత గనుక కొత్త పార్టీ పెడితే టీడీపీ కేడర్తో పాటు కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గం పెడితే, తెలంగాణలో వివిధ పార్టీల్లో ఉన్న  రెడ్డి సామాజిక వర్గీయులు మొత్తం ఆయన వెంట వచ్చే అవకాశం ఉంది.కెసిఆర్ ని కొద్దిగానైనా నిలువరించ గలిగేది రేవంత్రెడ్డి అన్నది చంద్రబాబు నిశ్చితాభిప్రాయం ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో సొంతంగా రేవంత్  అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు సూచించారని, అందుకే  రేవంత్ సొంత పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చంద్రబాబు డైరెక్షన్ చేస్తున్నారన్నది తెలంగాణలో వినిపిస్తున్న టాక్ .వారిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని పరిశీలిస్తే ఇందులో వాస్తవం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు .

Related posts

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju