స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ లాంటివి ఒక్క రూపాయికే వస్తే ఎలా ఉంటుంది..? ఇది ఊహించడానికి చాలా బాగుంటుంది కదూ.. కానీ నిజ జీవితంలో ఇది సాధ్యం కాదు అంటారా..? ఇలాంటి కలను నిజం చేసుకునే అవకాశం షావోమీ మీకు అందిస్తోంది. అవును మీరు చదివింది నిజమే.. దివాళి విత్ ఎంఐ పేరిట షావోమీ ప్లాష్ సేల్ ప్రకటించింది. ఇందులో రోజూ రెండు ప్రొడక్ట్ ల చొప్పున మొత్తం 12 ప్రొడక్ట్ లను సేల్ లో అమ్మనుంది. ఈ సేల్ లో ఒక్కో ప్రొడక్ట్ కు కేవలం ఒక్క రూపాయి మాత్రమే.. లిమిటెడ్ ప్రొడక్ట్ లు మాత్రమే ఉండే ఈ సేల్ లో మీ లక్ పండిందంటే మాత్రం ఒక్క రూపాయికే స్మార్ట్ టీవీ లభిస్తుంది. మరెందుకు ఆలస్యం ఇక మీరు కూడా ఈ సెల్ కు సిద్ధం అవ్వండి.
రెడ్ మీ నోట్ 9 ప్రో, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ టీవీ 4 ఏ స్మార్ట్ టీవీ లాంటి ప్రొడక్ట్స్ ని కేవలం రూ. 1 కే ఫ్లాష్ సేల్ లో అమ్మనుంది. అయితే వీటిని వివిధ తేదీల్లో సేల్ లో ఉంచింది. రెడ్ మీ నోట్ 9 ప్రోని అక్టోబర్ 16 న సాయంత్రం 4 గంటలకు రూ.13,999 విలువైన దీనిని కేవలం 10 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్ లో ఉంటాయి. దీనితో పాటు ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2ను కూడా ఇదే టైం కు 50 యునిట్స్ ను సేల్ లో ఉంచనుంది. అలాగే అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటలకు ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ను కేవలం 25 యునిట్స్ మాత్రమే సేల్ లో ఉంచునున్నారు. ఎంఐట్రూ వైర్ లెస్ 2 ఇయర్ ఫోన్స్ ను అక్టోబర్ 18 న సాయంత్రం 4 గంటలకు ఫ్లాష్ సేల్ లో అమ్మనుంది. ఇదే రోజున అదే సమయంలో ఎం బిజినెస్ క్యాజువల్ బ్యాక్ ప్యాక్ ను 50 యూనిట్స్ మాత్రమే సేల్ లో ఉంటాయి.
దీనితో పాటు ఎంఐనెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను అక్టోబర్ 19 న సాయంత్రం 4 గంటలకు 50 యూనిట్స్ ను సేల్ లో ఉంచనుంది. అదే రోజున ఎంఐ టీవీ 4 ఏ ను 20 యూనిట్స్ లో ఫ్లాష్ సేల్ లో ఉంచారు. ఎంఐ టీవీ బియర్ ట్రిమ్మర్ 1 సీ, రెడ్ మీ సోనిక్ బాస్ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ను వివిధ యూనిట్ల లో అక్టోబర్ 20న సాయంత్రం 4 గంటలకు సేల్ లో ఉంచారు. వీటితో పాటు షోవోమీ ప్రెసిషన్ స్క్రూ డ్రైవర్ కిట్, ఎంఐ రీఛార్జబుల్ ఎల్ఈడీ ల్యాంప్ లను అక్టోబర్ 21న సాయంత్రం 4 గంటలకు 50 , 50 యూనిట్స్ లో సేల్ లో ఉన్నాయి.
ఒకే ఒక్క రూపాయితో వీటన్నింటినీ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే మరింకెందుకండీ ఆలస్యం చెప్పిన సమయానికి మీ టైం ను కాస్త కేటాయించినట్టయితే వీటిని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆలోచించినా ఆశభంగం .. త్వర పడండి..ఐటెమ్స్ ను పొందండి…షావోమీ రా వోయి అంటుంది మరీ..