NewsOrbit
న్యూస్

అమెరికా ఎన్నికలలో భారతీయుల సత్తా…! ఈసారి మరో కొత్త రికార్డు…!!

 

 

అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికల ఫలితాలు నిమిష నిమిషానికి ఉత్కంఠంగా మారుతువస్తున్నాయి. తాజా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న భరత్ సంతతి కి చెందినవారు ఘన విజయం సాధించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున ప్రతినిధుల సభకు పోటీచేసిన నలుగురు భారతీయ సంతతి వ్యక్తులు రెండోసారి విజయం సాధించారు. ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమి బేరా మళ్ళీ గెలుపొందారు. అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ అమెరికన్ల ప్రభావం అత్యధికంగా కనిపించిన ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ కారణం గానే అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ అమెరికన్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ లో ప్రయత్నించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ఫ్లోరిడా, జార్జియా, మిషిగన్, నార్త్‌ కారొలీనా, పెన్సిల్వేనియా, టెక్సాస్‌లతోపాటు అమెరికా మొత్తమ్మీద సుమారు 18 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. భారతీయ అమెరికన్‌ ప్రజా ప్రతినిధుల సమూహానికి ‘సమోసా కాకస్‌’అని సెనేటర్‌ రాజా కృష్ణమూర్తి పేరుపెట్టారు. ‘సమోసా కాకస్’ గా పిలువబడే ఈ ప్రతినిధుల సభలో ఐదుగురు భారతీయ అమెరికన్లు ఉన్నారు. వీరిలో నలుగురు భారతీయ సంతతి వ్యక్తులు రెండోసారి విజయం సాధించారు.

ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి సమీప ప్రత్యర్ధి లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్‌‌పై సంపూర్ణ ఆధిక్యత ప్రదర్శించారు. ఇక్కడ రెండోసారి పోటీ చేసిన రాజా కృష్ణమూర్తి 71 శాతానికిపైగా ఓట్లను సాధించారు.

సమోసా కాకస్‌లో సీనియర్‌ అయిన 55 ఏళ్ల డాక్టర్‌ అమిరేష్‌ బాబులాల్‌ బేరా ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బజ్ ప్యాటర్‌సన్‌‌పై గెలిచారు.కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి బరిలోకి దిగిన డాక్టర్ అమి బెరా,25 శాతానికి పైగా పాయింట్ల తేడాతో విజయం సాధించారు. డాక్టర్ అమి బెరా వరుసగా ఐదవసారి కాలిఫోర్నియాలోని ఏడవ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుండి గెలుపొందారు.

అమెరికాలోని పెన్సిల్వేనియాలో 1976లో జన్మించిన రోహిత్‌ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, భారతీయ సంతతికి చెందిన రితేశ్‌ టాండన్‌పై విజయం సాధించారు. 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియాలో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీపడిన రో ఖన్నా,రిపబ్లికన్ అభ్యర్థి పైన 50 శాతం కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. ఇది రో ఖన్నాకు వరుసగా మూడోవ విజయం. ఏడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ప్రమీలా జయపాల్ గెలుపు బావుటా ఎగురేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్రైగ్ కెల్లర్‌ను ఓడించారు.

సెనేట్‌లో హోరాహోరిగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నీరజ్‌ అనంతాని (29) అరుదైన రికార్డు సృష్టించారు. ఒహాయో రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయ సంతతి అభ్యర్థిగా రికార్డుల్లోకి ఎక్కారు. స్టేట్‌ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున సెనేట్‌కు పోటీ చేశారు. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి మార్క్‌ ఫోగెల్‌పై విజయం సాధించారు. 23 ఏళ్ల వయసులోనే ఓహాయో స్టేట్‌ హౌస్‌కు ఎన్నికై ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించారు.

ఇదిలా ఉండగా, టెక్సాస్‌లోని ఇరవై రెండవ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమొక్రాట్ల తరపున శ్రీ ప్రెస్టన్‌ కుల్‌కర్ణి రిపబ్లికన్ల అభ్యర్థి ట్రాయ్‌ నెల్స్‌ తో పొట్టి చేసి ఓడిపోయారు. రిపబ్లికన్ల అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన మంగ అనంతాత్ముల (వర్జీనియా) కూడా డెమొక్రటిక్‌ అభ్యర్థి గెర్రీ కానొలీ చేతుల్లో పరాజయం పాలయ్యారు. వీరే కాకుండా రిపబ్లికన్ల తరఫున తొలిసారి పోటీ చేసిన మరో భారతీయ సంతతి అభ్యర్థి నిశా శర్మ కూడా కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్‌ పార్టీ ప్రతినిధి మార్క్‌ డిసాల్‌నీర్‌ ఈ స్థానం నుంచి గెలుపొందారు. అమెరికా పార్లమెంటరీ వ్యవస్థలో హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ అనేది దిగువ సభ కాగా. సెనేట్‌ ఎగువ సభ అన్నది తెలిసిందే.

Related posts

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N