NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌కు ప్ర‌త్య‌ర్థులే బ‌లం .. ఎలాగో తెలుసా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు . ఉద్య‌మ‌కాలంలో తెర‌మీద‌కు వ‌చ్చిన ఆయ‌న వ్యూహాలు ప్ర‌త్యేక‌ రాష్ట్రంలోనూ సాగుతున్నాయి. ఈ వ్యూహాల‌కు ఎత్తుగ‌ల‌కు ప్ర‌ధానంగా బ‌లైంది తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీలు.

అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఇప్ప‌టికీ కేసీఆర్‌కు ఇంకా చాన్స్‌లు ఇస్తుందంటున్నారు. ఉత్తమ్ రాజీనామాతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు క‌స‌ర‌త్తు చేస్తుంటే కొత్త పీసీసీ ఎంపిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది.

పీసీసీపై ఢిల్లీ పెద్దాయ‌న ఏమంటున్నారంటే…

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. కొత్త చీఫ్ వేటలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పడింది. అభిప్రాయ సేకరణ కోసం ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాగూర్‌ను హైదరాబాద్‌కు పంపిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించిన మాణికం ఠాగూర్ ఢిల్లీకి చేరుకున్నారు. కొత్త పీసీసీ చీఫ్‌పై సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్‌ గాంధీలకు అందజేశారు అయితే, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవకముందు మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల‌ ఇంఛార్జ్ చేసిన కామెంట్లు రాష్ట్రంలో ఆ పార్టీ ప‌రిస్థితికి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు అంటున్నారు.

న‌చ్చ‌క‌పోతే సోనియాను క‌ల‌వ‌చ్చు…

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఠాగూర్ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నట్టు వివ‌రించారు. 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామన్న ఆయన రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలను తెలుసుకున్నామ‌ని సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేస్తానన్న మాణికం ఠాగూర్… ఈ కసరత్తు పూర్తి కావడానికి మరి కొంత సమయం పడుతుందన్నారు. తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. సంప్రదింపుల్లో “పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందో చెప్పాలని” నేతలను కోరాను.. అందరి అభిప్రాయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన… ఎవరికైనా పీసీసీ ఎంపిక కసరత్తుపై ఇబ్బందిగా ఉంటే నేరుగా పార్టీ అధిష్ఠానాన్ని కలవొచ్చు అని సూచించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల అనైక్య‌త మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చిందంటున్నారు. ఇలాంటివే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ‌రం లాంటివని చెప్తున్నారు.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N