NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆకేపాటి… ఇలా చేసావేటి?? : టీటీడీ ను ముసురుతున్న డ్రోన్ వివాదం

 

 

**ఆకేపాటి అమర్నాథ్ రెడ్డీ… కడప జిల్లా రాజంపేటకు చెందిన వైస్సార్సీపీ నాయకుడు… మాజీ ఎమ్మెల్యే… తిరుమల వెంకన్నకు అపర భక్తుడు… మొదటి నుంచి రాజంపేటలో వైస్సార్సీపీ జెండా మోస్తున్న నాయకుడు… పాపం గత ఎన్నికల్లో కాలం కలిసి రాక.. ఆర్ధికంగా అంత బ్యాక్ గ్రౌండ్ లేక గత ఎన్నికల్లో జగన్ హామీ మేరకు టికెట్ను త్యాగం చేసిన వ్యక్తి…. అప్పటికి అప్పుడు టీడీపీ నుంచి వైస్సార్సీపీ లోకి వచ్చిన మేడ మల్లికార్జున రెడ్డీ కి జగన్ టికెట్ ఇచ్చి… వైఎస్ కుటుంబం తో మంచి పరిచయాలు ఉన్న ఆకేపాటి కి టీటీడీ చైర్మన్ ఇస్తానని హామీ ఇచ్చి మరీ టికెట్ మేడ కుటుంబానికి ఇచ్చారు జగన్.. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో… అందులోను వైస్సార్ వీర విధేయుడిగా ఉన్న ఆకేపాటికి టీటీడీ చైర్మన్ పదవి దక్కలేదు.. మొదట ఆయన పేరు తెర మీదకు వచ్చినా తర్వాత మారిన సమీకరణాలతో టీటీడీ చైర్మన్ పోస్ట్ సుబ్బారెడ్డి కి ఇచ్చారు జగన్… ఆ సమయంలో కుంగిపోయిన ఆకేపాటి పార్టీ మారెందుకు… వైస్సార్ కుటుంబం తో ఉన్న సంబంధాలు ఆయనకు అడ్డు పడ్డాయి… ఆ సమయంలో జగన్ టీటీడీ బోర్డు సభ్యుడి పదవికి ఆకేపాటి నీ ఎంపిక చేద్దామనుకున్న… దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు… అయితే ఇక్కడ నుంచే మొదలైంది అసలు కథ…..

**ఆకేపాటి అమర్నాథ్ రెడ్డీకి వెంకన్న అంటే అమిత భక్తి.. ఆయనకే కాదు ఆయన కుటుంబం అంత పిచ్చిగా శ్రీనివాసుడి సేవలో పాల్గొంటారు… టీటీడీ చైర్మన్ పదవి రాకపోయిన దగ్గర నుంచి ఆకేపాటి ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలినడకన రాజంపేట నుంచి తన అనుచరులు… తెలిసిన వారు సుమారు 500 మందిని వెంట బెట్టుకుని తిరుమల దర్శనానికి వస్తున్నారు… ప్రతి 3 నెలలకు ఇలా రావడం ఒక ఎత్తయితే… కడపవైపు నుంచి తిరుమల వచ్చే అన్నమయ్య మార్గం గుండా వీరు రావడం మరో ఎత్తు. వచ్చే ప్రతిసారీ వీరు ఫోటోలు, వీడియో చిత్రీకరణ చేయడం పరిపాటిగా మారింది. శేషాచలం మీదుగా అత్యంత దుర్భేద్య దారిలో డ్రోన్ కెమెరా ద్వారా వీరి పర్యటనలో ఆసాంతం చిత్రీకరణ చేస్తారు.
** గత రెండు రోజుల క్రితం తిరుమల పర్యటనకు వచ్చిన ఆకేపాటి అమర్నాథరెడ్డి బృందం అదే తీరున డ్రోన్ కెమెరా తో తిరుమల కనుమల్లో పైగా తిరుమల వరకు చిత్రీకరణ చేయడం… అది కొందరు టిడిపి కార్యకర్తల కంట పడడం జరిగింది… దీంతో ఇప్పుడు వివాదం రేగుతోంది… తిరుమల కనుమల్లో డ్రోన్ కెమెరా తో చిత్రీకరించడం నిషిద్ధం… ఒకవేళ ఏదైనా అత్యవసర విషయాలు వస్తే పోలీసు శాఖ అనుమతి ద్వారా మాత్రమే డ్రోన్ కెమెరా ను ఉపయోగించాలి… అయితే కడప వైపు నుంచి అన్నమయ్య మార్గం లో అతి క్లిష్టమైన మార్గంలో తిరుమల కొండ పైకి వచ్చే ఆకేపాటి బృందం ప్రతిసారీ డ్రోన్ కెమెరా తో చిత్రీకరించడం జరుగుతున్న మాట ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు… ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కి సంబంధించిన పిఆర్ బృందం మొత్తం రాజంపేట దగ్గర నుంచి తిరుమల కొండపైకి వెళ్లే వరకూ ఈ చిత్రీకరణలో ప్రతిసారి పాల్గొంటోంది. ఇప్పుడు మాత్రం ఇది బయటకు రావడంతో టీటీడీ పొరపాట్లు జరిగినట్లు ఏదో డ్రోన్ కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది… మొత్తానికి అమర్నాథ్ రెడ్డి చైర్మన్ పోస్టు రాకపోవడంతో పాటు…. బోర్డు మెంబర్ పదవి వద్దని ఇప్పుడు తిరుమల కాలినడకన రావడం సైతం ఆయనకు అంత అచ్చు వచ్చినట్లు లేదు… వచ్చేసారి ఆగే పార్టీ బృందం వస్తే టిటిడి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ఎలాంటి వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి..

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju