NewsOrbit
జాతీయం న్యూస్

బజాజ్ ఫైనాన్స్ సంస్థకు భారీ జరిమానా!కస్టమర్లను కాల్చుకుతినడం పై ఆర్బీఐ సీరియస్!

బజాజ్ ఫైనాన్స్ సంస్థ పేరు వినని వారుండరు.గృహోపకరణాల నుంచి వాహనాల వరకు దేనికైనా ఈ సంస్థ ఫైనాన్స్ చేస్తుంది.రుణ మంజూరు విధానం చాలా సరళతరంగా ఉంటుంది కానీ ఆ తర్వాత రుణాల వసూలు విషయంలో మాత్రం ఈ సంస్థ అతి కఠినంగా వ్యవహరిస్తోంది.వడ్డీలు కూడా వాయింపు రీతిలో ఉంటాయి.

బజాజ్ ఫైనాన్స్ సంస్థ పై ఈ విషయాల్లో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మీడియాలో కూడా ప్రత్యేక కథనాలు రావడం జరిగింది.విషయం అటు తిరిగి ఇటు తిరిగి రిజర్వు బ్యాంకు దాకా వెళ్లడంతో ఆర్బీఐ స్పందించింది.దీంతో ఫైనాన్స్ సంస్థ బజాజ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాకిచ్చింది.ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల జరిమానా విధించింది.కాగా కస్టమర్ల నుంచి రుణాలు రికవరీ చేయడంలో బజాబ్ ఫైనాన్స్ అనుసరిస్తున్న పద్దతులే ఇందుకు కారణమని రిజర్వు బ్యాంకు ప్రకటించింది . కస్టమర్ల నుంచి రుణ రికవరీలో బజాజ్ ఫైనాన్స్ పద్ధతి బాగోలేదని చాలా ఫిర్యాదులు రావడంతో ఆర్బీఐ కొరడా ఝళిపించింది. రూల్స్ అతిక్రమించినందుకు భారీ జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బజాజ్ ఫైనాన్స్ కంపెనీపై రూ 2.5 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ తన ఔట్ సోర్సింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మేనేజింగ్ రిస్క్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ను అతిక్రమించడంతో ఆర్బీఐ సీరియస్ అయింది.

రిజర్వ్ బ్యాంకు నిబంధనలను బేఖాతరు!

ఆర్బీఐ నిర్దేశించిన రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం కస్టమర్ల నుంచి బజాజ్ ఫైనాన్స్ రుణాలు రికవరీ చేయడం లేదు.ఇంకా బజాజ్ ఫైనాన్స్ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ నిబంధనలు కూడా అతిక్రమించిందని ఆర్‌బీఐ తెలిపింది.బజాజ్ ఫైనాన్స్ నిబంధనలను అతిక్రమించడంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ 1934లోని సెక్షన్ 58 జీ, 58 బీలో ఉన్న పలు సబ్‌సెక్షన్ల కింద బజాజ్ ఫైనాన్స్‌పై జరిమానా విధించామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రుణ రికవరీలో భాగంగా రికవరీ ఏజెంట్లు వినియోగదారులను వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆర్బీఐకి ఫిర్యాదులు అందాయ్. వేధింపులకు గురిచేయకుండా చూసుకోవడంలో బజాజ్ ఫైనాన్స్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొని జరిమానా విధించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. రుణ రికవరీపై కంపెనీపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని ఈ సందర్భంలో తెలిపింది. ఇలాంటి చర్యలు మరోసారి పునారవృతం అయితే…కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

 

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju