NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu KCR: చంద్రబాబు – కేసీఆర్ డబుల్ గేమ్..! సేఫ్టీ కోసమా..? వేచి చూద్దామనా..!?

Chandrababu KCR: Double Game in Telugu Politics

Chandrababu KCR:  చంద్రబాబు డబుల్ గేమ్ ఆడడం రాజకీయాల్లో కొత్త కాదు.. కానీ దారుణంగా ఓడించి.., 23 స్థానాలకే పరిమితం చేసి.. నువ్విక పనికిరావు అనే స్థాయిలో తీర్పు ఇచ్చిన తర్వాత చంద్రబాబు రాజకీయంలో, నైజాంలో, వ్యూహంలో, ఏమైనా మార్పు వస్తుందేమో.., పూర్వపు బుద్ధులు కొంచెం తగ్గించుకుంటారేమో అను రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కానీ నో యూజ్..! ఇదే కోవలోకే కేసీఆర్ కూడా వస్తారు. రాజకీయ గురువు చంద్రబాబు లాగానే కేసీఆర్ కూడా ఏ ఎండకాగొడుగు పట్టేలా బాగానే అలవాటు చేసుకున్నారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే…

* 2019 ఎన్నికలకు ముందు.. చంద్రబాబు మూడో ఫ్రంట్ అని నానా హడావిడి చేసిన సంగతి గుర్తుందా..!? అప్పుడే కాదు. చాలా సందర్భాల్లో చంద్రబాబు మూడో ఫ్రంట్ అంటూ తిరుగుతూ జాతీయ స్థాయిలో చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తుంటారు. నానా హడావిడి చేస్తారు. ఢిల్లీ వెళ్తారు. అందరినీ కలుస్తారు. ప్రెస్ మీట్లు పెడతారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడెందుకు సైలెంట్ అయినట్టు..!?

* 2019 ఎన్నికల సమయంలోనూ.. ఆ తర్వాత కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ అని పేరు పెట్టి ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడారు. చాల ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ తిరిగారు. కొందరు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిశారు. కానీ ఈయన కూడా ఇప్పుడెందుకు సైలెంట్ అయినట్టు..!?

Chandrababu KCR: Double Game in Telugu Politics
Chandrababu KCR: Double Game in Telugu Politics

Chandrababu KCR:  ప్రాంతీయ పార్టీలకు ఇది సీజన్ ..!?

ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల సీజన్ మొదలయింది. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక్కటి చేసి ప్రధాని పదవిని డిసైడ్ చేసే లక్ష్యంతో ఉన్నారు. బీజేపీని దించడమే పనిగా ఆయన వ్యూహాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట శరద్ పవార్ ఇంట్లో కీలక భేటీ కూడా జరిగింది. దేశంలోని 16 ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. కానీ చంద్రబాబు/ టీడీపీ తరపున, కేసీఆర్/ టీఆరెస్ తరపున ఏ ఒక్కరూ హాజరవలేదు. గతంలో ఇదే పార్టీలను కలవడానికి.. మూడో ఫ్రంట్ పేరిట ఏకం చేయడానికి ప్రయత్నాలు చేసిన ఈ కీలక నాయకులు ఇద్దరూ తమ పార్టీలను ఈ భేటీకి పంపించలేదు. పంపించకపోవడం తప్పు కాదు అనుకుందాం… పోనీ కనీసం వారి అభిప్రాయం అయినా చెప్పాలిగా.. ఒక సీనియర్ నాయకుల హోదాలో.. సీఎం స్థాయిలో ఉన్న నాయకులుగా.., మూడో ఫ్రంట్ కోసం ప్రయత్నం చేసిన అనుభవమున్న ఈ ఇద్దరూ సైలెంట్ అయ్యారు. మూడో ఫ్రంట్ వరకు జగన్ ని పక్కన పెట్టేయొచ్చు. ఆయన ఎప్పుడూ మూడో ఫ్రంట్ అని కారు కూతలు కూయలేదు. బిల్డప్ మాటలు చెప్పలేదు.

Chandrababu KCR: Double Game in Telugu Politics
Chandrababu KCR: Double Game in Telugu Politics

బీజేపీ అంటే భయమా..!? రాజకీయ భధ్రత కోసమా..!?

బీజేపీ ఇప్పుడు దేశంలో ఒక పెద్ద శక్తిగా మారింది. వ్యవస్థేతర శక్తిగా మారి.. రాజ్యాంగేతర వ్యవస్థాగన్నూ రూపాంతరం చెందుతుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో… 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ ఏం అనుకుంటే అదే చేస్తున్నారు. అమిత్ షా.., మోడీల జంట దేశం మొత్తం ఒంటి చేతితో శాసిస్తున్నారు. సో.. ఈ సమయంలో బీజేపీతో పెట్టుకోవాలి అంటే ఎవరికైనా భయమే.. అందులోకి చంద్రబాబు, కేసీఆర్ లాంటి సేఫ్ గేమ్ ఆడే రాజకీయూలకు అయితే మరీ భయం. పాత కేసులు తిరగేయడమో.. కొత్త కేసులు పెట్టించడమో.. పాత పరిపాలన తవ్వడమో బీజేపీకి పెద్ద పనేమీ కాదు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా ఏమి బాలేదు. తెలంగాణాలో కేసీఆర్ పై చాలా తీవ్ర ఆరోపణలున్నాయి. ఇవన్నీ తెలిసిన చంద్రబాబు కానీ.. కేసీఆర్ కానీ ఈ సమయంలో తృతీయ ఫ్రంట్ అంటూ ఢిల్లీకి తిరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదు. మిగిలిన ప్రాంతీయ పార్టీల్లో కూడా ఈ భయం ఉన్నప్పటికీ.. వారికి పీకే అండ.. కొంచెం తెగింపు ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు. ఇక్కడ ఎవరి భద్రత.., ఎవరి భవిష్యత్తు వారు చూసుకుని రాజకీయాలు, పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంటారు. జగన్ కూడా ఇదే కోవలోకి వస్తారు. కాకపోతే ఆ ఇద్దరి తర్వాత స్థానంలో ఉంటారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju