NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి కాస్ట్లీస్వాగతం! జీహెచ్ఎంసీ నుండి భారీ షాక్..!!

Kaushik Reddy: ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజారాబాద్ నేత కౌశిక్ రెడ్డి బుధవారం సీఎం కేసిఆర్ ఆద్వర్యంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డిని సీఎం కేసిఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా, కౌశిక్ రెడ్డికి మాత్రం జీహెచ్ఎంసీ భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ నాయకుడికి వేయనంత పెద్ద మొత్తంలో కౌశిక్ రెడ్డికి జరిమానా విధించి జీహెచ్ఎంసీ తమకు అందరూ సమానమేనని నిరూపించారు.

GHMC shocked Kaushik Reddy
GHMC shocked Kaushik Reddy

Read More: Mamata Banerjee: బీజేపీని అధికారం నుండి దించే వరకూ “ఆట ఆగదు” అంటూ గర్జించిన బెంగాల్ దీదీ

విషయంలోకి వెళితే.. అధికార పార్టీలో చేరుతున్నాము కదా అడిగేది ఎవరు అనుకున్నారో ఏమో కానీ.. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్న సందర్భంగా గచ్చిబౌలి నుండి టీఆర్ఎస్ భవన్ వరకూ భారీ ఎత్తున హోల్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహానగరంలో దాదాపు 20 కిలో మీటర్ల మేర వేలాది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఏర్పాటు చేయగా బుధవారం సాయంత్రం వరకూ ఈ ఫ్లెక్సీలు, హోల్డింగ్స్ ఉన్నాయి. అయితే వీటిపై పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెళ్లాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు నెటిజన్ లు సోషల్ మీడియా వేదికగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు, ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుండి జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ సదరు ఫ్లెక్సీలు, హోల్డింగ్ తొలగించే పని ప్రారంభించింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినందుకు కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ రూ.5.60 లక్షలు జరిమానా విధించింది.

గురువారం కూడా మరి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పరిశీలించి జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ జీహెచ్ఎంసి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే ప్రధమమని తెలుస్తోంది. గతంలో పది వేలు, 20వేలు, లక్ష వరకూ మాత్రమే జరిమానాలు వసూలు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొలి రోజునే కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ షాక్ ఇస్తూ ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం విశేషం. ఇంతకు ముందు టీ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు కొద్ది గంటల్లోనే తొలగించారు. అయితే కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బుధవారం సాయంత్రం వరకూ ఉంచడంతో జీహెచ్ఎంసీ అధికారుల తీరును తప్పుబడుతూ నెటిజన్, విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీంతో జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju