Ladies: మీ కిష్టమైన మగవాడిని ఆకర్షించడం, మీ కోసం పడి చచ్చేలా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలా చేయాలంటే దానికి మీరు కనిపించే విధానం, మీ చూపులు మాత్రమే సరిపోదు. పెదాలు అందంగా కనిపిస్తే సరిపోదు ఆ పెదవులతో గొప్పగా మాట్లాడేలా ఉండాలి. అప్పుడే పెదవుల అందం రెట్టింపు కాగలదు . అలాగే ఎదుటివారిని మాయ మరిపించి మీ మాయాజాలంలో పడేలా చేయాలంటే కేవలం డ్రెస్సింగ్ సరిపోదు. మీ మీద మనసు పడాలంటే మీ ప్రేమ లో మునకలు వేయాలి అన్న ముందు మిమ్మల్ని మీరు ఆరాదించుకోవాలి. మీ తో మీరు మాయలో పడాలి. కాస్ట్లీ డ్రెస్సులు , నగలు, మేకప్ ఇవన్నీ అప్పటికప్పుడు మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తాయి. కానీ అది పనిచేయదు.
ఎప్పటికి నిలిచి ఉండే మానసిక అందం మీద మీ శ్రద్ధ పెట్టండి. మీలో మీకు బాగా నచ్చే విషయాలు ఏమిటి ? మీరు ఎవరితోనయినా త్వరగా కలిసిపోతారా .. , బాగా మాట్లాడగలుగుతార.. కేరింగ్ గా ఉంటారా, ఉదార స్వభావులా? జాలి హృదయం కలిగినవారా.. ఇలా మీ గురించి మీకు కచ్చితం గా తెలిసి ఉండాలి. మీలో ఉన్న ఎలాంటి స్వభావాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు ? ఇలా ప్రతి దాని గురించి తెలిసి ఉండటం మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకోవడం అన్నమాట. మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు అంటే .. అస్సలు మీరు ఎవరు, మీరు వారి నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏమి ఇవ్వదలచారు అనేది చాలా స్పష్టంగా మీకు తెలిసి ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేది కొనుక్కొచ్చుకునే వస్తువు కాదు. దాన్ని పొందాలి అంటే మీ గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అందుకే తాత్కాలికమైన విషయాల తో కాకుండా మీలో ఉన్న లోపాల తో ప్రేమలో పడండి. అలా చేయడం వలన అది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు ఎలా ఉంటారో అలాగే అందరి ముందు ఉండటానికి ఏ మాత్రం ఆలోచించకండి. మీలో ఉన్న లోపాల తో పాటు మిమ్మల్ని మీరు గర్వంగా ప్రదర్శించుకుంటూ ఉండండి.
ఆడవారిలో మగవారు ముందుగా కనిపెట్టేది వారి కదలికలను. తమ గురించి తాము కాకుండా ఎదుటివారు తన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆడవారు ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు.దాని ప్రకారం వారు నడుచుకుంటూ ఉంటారు. అయితే మీ వ్యక్తిత్వం అనేది మీరు ఏంటో నిర్ణయిస్తుంది. మీరు ధరించిన వాటి కన్నా మీ వైబ్ నే మగవారు ఎక్కువగాగుర్తిస్తారు. మీకు సౌకర్యంగా ఉండే దుస్తులు మీరు వేసుకుంటే అది మీ ప్రవర్తనలో కనిపిస్తుంది. సౌకర్యంగా లేకపోతే అది మీలో ఉన్న నిరాశ, నిస్పృహలను బయటకు తెలిసేలా చేస్తుంది.ఇలా ఉన్న మిమ్మల్ని చూసి ఎవరైనా ఎలా ఆకర్షితులవుతారు.