NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Visakha Steel Plant: జగన్ నాయకత్వానికి చంద్రబాబు జిందాబాద్ కొడతారంట..! ఏపిలో ఊహించని ట్విస్ట్..!!

Visakha Steel Plant: ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఆ సమస్యను రాజకీయం చేయడానికి ఇంకా ఎక్కువ మార్గాలు ఉంటాయి. అలా రాజకీయం చేయడంలో చంద్రబాబు దిట్ట. రాజకీయ సమస్యలను పరిష్కరించడం కంటే తప్పించుకోవడంలో కూడా ఆయనది అందె వేసిన చేయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తాజాగా చంద్రబాబు పెట్టిన మెలిక ఆయన అనుభవానికి, ఇన్నాళ్లు ఆయన చేసిన రాజకీయానికి ఓ మచ్చుతునక. ఏపి రాజకీయాల్లో వివాదాస్పదంగా మారి మూడు జిల్లాల భవిష్యత్తును శాశిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పందించిన చంద్రబాబు జగన్ ప్రభుత్వానికే ఇరుకున పెట్టేలా తన అనుభవాన్ని ప్రదర్శించారు.

Chandra babu key suggestion to ys jagan on Visakha Steel Plant issue
Chandra babu key suggestion to ys jagan on Visakha Steel Plant issue

Read More: Sama Venkata Reddy Resigns TRS: కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన వేళ కేసిఆర్ కు సీనియర్ నేత సామ బిగ్ షాక్..!!

ఏపి రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్

ఏపిలో మొదటి నుండి వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ తమిళనాడు తరహాలో ఉమ్మడిగా పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క ప్రధాన సమస్యపైనా అఖిలపక్ష మీటింగ్ జరగలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అన్ని రాజకీయ పక్షాలు ఒకే మాట మీదకు వస్తున్నాయి. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో కార్మిక లోకం భగ్గుమంది.

Visakha Steel Plant: ‘గంటా’ దారిలోనే అందరూ?

ఆ ప్రతిపాదన వచ్చిన నాటి నుండి కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కార్మికుల ఆంధోళనకు వివిధ రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేస్తున్నాయి. మాజీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ శాసనసభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. కానీ ఇంత వరకూ ఇతర ప్రజా ప్రతినిధులు రాజీనామాలకు ఇంకా సిద్ధం కాలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అధికార వైసీపీతో సహా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకిస్తున్నా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్పితే ఐక్య ఉద్యమానికి బాటలు వేయలేదు.

చంద్రబాబు సంచలన ప్రకటన

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకువచ్చిన ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని సీఎం జగన్ ముందు ఉండి నడిపించాలని కోరారు. ఐక్య పోరాటం ద్వారానే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా కాపాడుకోగలమని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం టీడీపీ నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అంతా రాజీనామాకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ఈ కీలక ప్రతిపాదన చేయడం విశేషం. చంద్రబాబు ప్రతిపాదనపై సీఎం జగన్ ఏమంటారో చూడాలి మరి.

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N