NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Teenmar Mallanna: త‌గ్గేదేలే అంటున్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌…. తాజాగా క‌ల‌క‌లం..

Teenmar Mallanna: తీన్మార్ మల్ల‌న్న గ‌త రోజులుగా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం రాత్రి పోలీసులు మ‌ల్ల‌న్న‌ ఆఫీసులో సోదాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై మ‌ల్ల‌న్న ఘాటుగా స్పందించారు. తీన్మార్ మ‌ల్ల‌న్న టీం 7200 వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా స‌భ్యుల స‌మావేశంలో మాట్లాడిన మ‌ల్ల‌న్న సంచ‌ల‌న కామెంట్లు చేశారు. త‌న‌పై ఎన్ని అక్ర‌మ‌ కేసులు పెట్టినా.. ఏం చేయ‌లేరని ఆయ‌న పేర్కొన్నారు.

Read More: Revanth reddy: రేవంత్ రెడ్డి ని ఘోరంగా అవ‌మానించిన కేసీఆర్ స‌ర్కారు


మ‌ల్ల‌న్న సంచ‌ల‌న కామెంట్లు…
కేసీఆర్ పాల‌న‌కు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని మ‌ల్ల‌న్న‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెండేళ్ల త‌ర్వాత జైలుకెళ్ల‌డం త‌ప్ప‌ద‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కేసీఆర్‌కు రాజ‌కీయ స‌మాధి క‌డ‌తాన‌ని వ్యాఖ్యానించారు. సోమ‌వారం రాత్రి త‌న చానెల్‌పై దాడి జ‌ర‌గ‌బోతోంద‌న్న విష‌యం కూడా త‌న‌కు ముందే తెలుస‌ని వ్యాఖ్య‌నించారు. నా క‌ద‌లిక‌లు క‌నిపెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌రు గాని, కేసీఆర్ తీసుకునే ప్ర‌తి చ‌ర్య‌, ప్ర‌తి క‌ద‌లిక త‌న‌కు ముందే తెలుస్తోంద‌ని అన్నారు. సోమ‌వారం రాత్రి దాదాపు 50మంది పోలీసులు త‌న ఆఫీసులో సోదాలు నిర్వ‌హించి హార్డ్ డిస్క్‌లతో పాటు అనేక ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను వెంట తీసుకెళ్లార‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల డేటా త‌న వ‌ద్ద ఉంద‌నే స‌మాచారంతోనే కేసీఆర్ ఈ దాడులు చేయించ‌డాని ఆరోపించారు. అస‌లు స‌మాచారం ఉన్న హ‌ర్డ్ డిస్క్‌లు ఇంకా భ‌ద్రంగానే ఉన్నాయంటూ త‌న శైలిలో కామెంట్ చేశారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసే దిశ‌గా తీన్మార్ మ‌ల్ల‌న్న 7200టీం స‌భ్యులు ప్ర‌జాక్షేత్రంలో ప‌నిచేయ‌బోతున్నార‌ని అన్నారు. ఆగ‌స్టు 29 నుంచి ఆట మొద‌లు కాబోతోందని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

Read More: KCR: బీపీ పెరుగుతోంది అంటూ కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

విద్య, వైద్య‌మే మా ఎజెండా…
అంద‌రికీ మెరుగైన‌ విద్య‌, వైద్యం ఉచితంగా అందించ‌డం కోస‌మే తీన్మార్ మ‌ల్ల‌న్న టీం కొట్లాడ‌బోతోంద‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఓటు హ‌క్కు విలువ‌ను చాటిచెప్ప‌బోతోంద‌ని అన్నారు. ప్ర‌శ్నించే త‌త్వాన్ని నేర్పించ‌బోతున్నాం. ఇంటికో తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను త‌యారు చేయ‌బోతున్నామంటూ ఉద్వేగంగా ప్ర‌సంగించారు. రాజ‌కీయ పార్టీల‌పై కాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తీన్మార్ మ‌ల్ల‌న్న టీం పోరాటం చేయ‌బోతోంద‌ని, అది కూడా శాంతియుతంగా, కొట్లాట‌లు లేకుండా రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల రూపంలో ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N