NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Vijaya Shanthi: కేసిఆర్ సర్కార్ కు విజయశాంతి హెచ్చరిక ..! ఏ విషయంలో అంటే..?

Vijaya Shanthi: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేసిఆర్ సర్కార్ విద్యాసంస్థలు పునః ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో సెప్టెంబర్ 1వ తేదీ నుండి తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ బీజేపీ మహిళా నేత విజయశాంతి కామెంట్స్ చేశారు. కోవిడ్ తగ్గిందంటూ పాఠశాలలు తెరిచేందకు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే పాలకులకు విద్యార్థుల భవిష్యత్తుపై ఏ మాత్రం పట్టింపు లేదన్నట్లు అర్ధం అవుతోందన్నారు.

Vijaya Shanthi serious comments on kcr government
Vijaya Shanthi serious comments on kcr government

Read More: Vijaya Sai Reddy: విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి

వర్షాలకు తరగతి గదులు దెబ్బతిన్నాయి

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో లాక్ డౌన్లు విధించడంతో అనేక పాఠశాలల్లో ఫర్నిచర్ పాడైపోయిందనీ, వర్షాలకు తరగతి గదుల గోడలు, పైకప్పు దెబ్బతిని ప్రమాదకరంగా తయారు అయ్యాయన్నారు విజయశాంతి. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల్లో తాగునీరు, మురుగుదొడ్ల సదుపాయాలు కూడా కరువైనట్లు ఉస్మానియా యూనివర్శిటీ మాజీ డీన్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అనేక ప్రాంతాల్లో కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాలలకు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని తెలిపారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం పాఠశాలలను తెరిచేందుకు వారం రోజులు కూడా సమయం లేదనీ, ప్రాధమిక సౌకర్యాల పరిస్థితులు చక్కదిద్దకుండా పిల్లలను పాఠశాలలకు రప్పిస్తే వారు చదువుకునే పరిస్థితి ఉందా అని విజయశాంతి ప్రశ్నించారు. అగ్రరాజ్యం అమెరికాలో కూడా విద్యాసంస్థలు తెరిచిన తర్వాత విద్యార్థుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయని విజయశాంతి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే పాఠశాలలను తెరవాలని తల్లిదండ్రులతో సహా అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ఇవేమీ పట్టించుకోకుండా తెలంగాణ పాలకులు ముందుకు వెళితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని విజయశాంతి హెచ్చరించారు.

కేసిఆర్ సర్కార్ విధానాలపై తరచు సోషల్ మీడియా వేదికగా విజయశాంతి విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. ఇప్పుడు తాజా పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ అంశంపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విజయశాంతి కామెంట్స్ పై కేసిఆర్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju