NewsOrbit
న్యూస్

CM YS Jagan: రేపు ఏపీ కేబినెట్ భేటీ …! పలు కీలక అంశాలపై చర్చ ..!! 

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన బుధవారం (28వ తేదీ) ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది. ఎజెండాలోని పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. అన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాల ఆర్డినెన్స్ కు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అదే విధంగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరుగనుంది. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామక అంశంపైనా చర్చ, చట్ట సవరణ పై చర్చించనున్నారు. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

CM YS Jagan: Tomorrow ap cabinet meeting
CM YS Jagan: Tomorrow ap cabinet meeting

Read More: AP CM YS Jagan: ఏపిలో భారీ టూరిజం ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!!

CM YS Jagan: గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ సమావేశం

కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం కానున్నారు. టీడీపీ కార్యాలయం సహా నేతలపై వైసీపీ శ్రేణుల దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మొన్న ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందనీ, 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు.

 

Read More: Viveka Murder Case: వివేకా హత్య కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ ..! ఈ నలుగురే నిందితులు..!!

ఈ నేపథ్యంలో గవర్నర్ తో సీఎం జగన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంలో సీఎం జగన్ ..  టీడీపీ కార్యాలయంపై దాడుల అంశంపై వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాడులకు దారి తీసిన పరిస్థితులను గవర్నర్ కు సీఎం జగన్ వివరించనున్నట్లు సమాచారం. దాడులకు ముందు టీడీపీ నేతలు తనను ఉద్దేశించి చేసిన దూషణలకు సంబంధించి సీడీలు, ఇతర అధారాలను గవర్నర్ కు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా వచ్చే నెలలో శాసనసభ సమావేశాల నిర్వహించాలని సిఎం జగన్ భావిస్తున్నందున, సభ నిర్వహణల పైనా గవర్నర్ తో సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju