NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: పొద్దు పొద్దునే వైసీపీ ఎమ్మెల్యే రోజాకి భారీ ఝలక్..

YSRCP: రాజకీయ నాయకులు తమ ఎన్నో కలలు కంటుంటారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఏన్నో ప్రయత్నాలు, లాబీయింగ్ లు చేస్తారు. కొందరికి మాత్రం పదవులు అనూహ్యంగా వరిస్తుంటాయి. కొందరికి ప్రయత్నంలో లోపం లేకున్నా కల నెరవేరే పరిస్థితి ఉండదు. సాధారణంగా రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గా ఎన్నికైన అధికార పార్టీ నాయకులకు మంత్రి పదవి పొందాలన్న కోరిక ఉంటుంది. కానీ కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి మంత్రి పదవి లభించదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్రపడిన సినీ నటి ఆర్కే రోజాకు ఈ సారి కూడా జగన్ ఝలక్ ఇస్తారన్న టాక్ నడుస్తోంది. కులాలు, ప్రాంతాల ఈక్వీషన్ ల నేపథ్యంలో జగన్ ఈ ఫైర్ బ్రాండ్ నాయకురాలికి మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నారు.

YSRCP MLA Rk roja minister post
YSRCP MLA Rk roja minister post

 

Read More: YSRCP: సీఎం జగన్ ను ఆ మాజీ ఎంపీ కలిసింది అందుకేనా? విజయసాయికి రెన్యువల్ ఉన్నట్లా..? లేనట్లా?

YSRCP: మంత్రి పదవి ఖాయం అనుకుంటే..?

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు వైసీపీ తరపున ఆర్ కే రోజా ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 2014లో రోజా పార్టీ కోసం విస్తృతంగా పని చేశారు. గత టీడీపీ హయాంలో అసెంబ్లీలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఏడాది పాటు సస్పెన్షన్ కు కూడా గురైయ్యారు. వైసీపీ తరపున గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీ గూటికి చేరినా రోజా పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తూ పార్టీ వాణిని గట్టిగా వినిపించారు. టీడీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తూ జగన్ వద్ద మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఇక 2019లో రెండవ సారి ఎమ్మెల్యే కావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాకు మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. ఆమెకు మంత్రి పదవి ఖాయమనే భావించారు. కానీ చిత్తూరు జిల్లా నుండి సీనియర్ నేత, వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డితో పాటు ఎస్సీ కోటాలో నారాయణ స్వామికి మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడంతో రోజా నిరుత్సాహానికి గురైయ్యారు. వైసీపీ పట్ల అలక బూనిన నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో కొంత మేర శాంతించారు. అయితే ఆ పదవీ మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టకూడదని తీసుకున్న నిర్ణయంలో భాగంగా రోజా ఆ పదవీ వదులుకోవాల్సి వచ్చింది.

 

ఈ సారి కూడా రోజాకు బ్యాడ్ లక్ యేనా..?

అయితే ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన జరగనున్న సంగతి తెలిసిందే. జగన్మోహనరెడ్డి గతంలో చెప్పిన ప్రకారం ఇప్పటికే మంత్రివర్గ ప్రక్షాళన జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఉగాది పండుగ తర్వాత మంత్రి వర్గ ప్రక్షాళన జరుగుతుందని వార్తలు వినబడుతున్నా ఈ సారి కూడా రోజాకు అవకాశం కష్టమేనని అంటున్నారు. అందుకు కారణం ఏమిటంటే.. జిల్లాల విభజన నేపథ్యంలో  చిత్తూరు జిల్లా పరిధిలో చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు. పూతలపట్టు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పుంగనూరు నుండి ప్రాతినిత్యం వహిస్తున్న సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా నుండి మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గం నుండి ఆయనను తొలగించే అవకాశాలు లేవు. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరి నియోజకవర్గం కూడా చిత్తూరు జిల్లాలోనే ఉండటంతో ఈ సారి కూడా రోజాకు బ్యాడ్ లక్ తప్పదని అనుకుంటున్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju