NewsOrbit
5th ఎస్టేట్ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: కేసిఆర్ కి జగన్, పవార్, థాక్రే వరుస షాక్ లు..! భయమా – వ్యూహమా..!?

YS Jagan: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అన్ని రాష్ట్రాల సీఎంలను, అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక కూటమి కడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండగా, కేసిఆర్ మూడవ కూటమి ఎందుకు తీసుకువస్తున్నారు..? అంటే.. అటు కాంగ్రెస్ తో, ఇటు బీజేపీతోనూ కలవని వారిని తృతీయ కూటమిలోకి రప్పించాలన్నది కేసిఆర్ వ్యూహం. థర్డ్ ఫ్రంట్ ఇప్పుడు కొత్తగా ఏమి రాలేదు. ఎప్పటి నుండో దేశంలో ఉంది. దానికి ఒక్కో సారి ఒక్కో నాయకుడు తెరమీదకు వస్తారు. ఒక్కో సారి ఒక్కో నాయకుడు దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటారు. దానిలో భాగంగా ఇప్పుడు కేసిఆర్ దాన్ని భూజన వేసుకున్నారు. కూటమి బలోపేతానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

YS Jagan: KCR Third front
YS Jagan: KCR Third front

Read More:Mekapati Goutham: ఆ విషయంలో టీడీపీ తప్పులు..! బాబు పెద్దరికం..నేతల అత్యుత్సాహం..!

YS Jagan: ఒకే రోజు ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ తో కేసిఆర్ భేటీ..

ఈ క్రమంలో భాగంగా రీసెంట్ గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేని కలిశారు. అదే రోజు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, థర్డ్ ప్రంట్  ఆవశ్యకతపైనా చర్చించారు. కానీ ఉద్దవ్ థాకరేకి కేసిఆర్ పై నమ్మకం లేదన్నట్లు కనబడుతోంది. కేసిఆర్ ను కలిసిన తరువాత ఉద్దవ్ థాకరే తన వాళ్లతో మాట్లాడిన మాటలు అందుకు ఊతం ఇస్తున్నాయి. తృతీయ ఫ్రంట్ అవసరమే కానీ ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి వస్తాయా..? లేదా అన్న సందేహాలు ఉన్నాయి. కేసిఆర్ వల్ల కాదు అన్నట్లుగా ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ను కూడా కలుపుకుంటే బీజేపీతో పోరాడటానికి బాగుంటుంది అన్న ఆలోచన ఉద్దవ్ థాకరేలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క శరద్ పవార్ కేసిఆర్ ప్రతిపాదన పట్ల అంత సుముఖంగా లేరని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి వస్తాయా..? కొంత మంది పార్టీ నేతలు వారిపై ఉన్న కేసుల తదితర కారణాల వల్ల రేపు తృతీయ ఫ్రంట్ నుండి బయటకు వెళ్లి బీజేపీతో కలిసే అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తున్నారుట.

 

Read More: Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డి – పునీత్ రాజ్ కుమార్..! మరణానికి ముందు చివరి గంటలో..!!

YS Jagan: అనేక రకాల అంచనాలతో కేసిఆర్ ముందడుగు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీజేపీకి బద్ద వ్యతిరేక పార్టీ అయినా ఆ పార్టీ నేతలపై ఉన్న కేసుల కారణంగా కేంద్రంలోని బీజేపీ ఇబ్బందులు పెడుతూనే ఉంది. మరో పక్క ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక్కో సారి బీజేపీకి వ్యతిరేకంగా, మరి కొన్ని సార్లు బీజేపీకి అనూకూలంగా మాట్లాడుతుంటారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలు గానీ, సీఎంలు గానీ కేంద్రంలోని బీజేపీతో ఎప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. నిజానికి కేసిఆర్ జగన్మోహనరెడ్డి పట్ల చాలా హోప్స్ పెట్టుకున్నారు. జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసిఆర్, స్టాలిన్ వచ్చారు. ముగ్గురూ కలిసి తిరిగారు. రాజకీయాల్లో తనే సీనియర్ కాబట్టి మిగిలిన ఇద్దరు సీఎంలు తాను చెప్పినట్లు వింటారని కేసిఆర్ భావించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి తృతీయ ఫ్రంట్ పెట్టేయవచ్చు. లీడ్ చేయవచ్చు తానే ప్రధాన మంత్రి అభ్యర్ధిని అవ్వవచ్చు, టీఎంసీ, బీజూ జనతాదళ్, ఆప్, ఎన్సీపీ తనకే సపోర్టు చేస్తారు అన్న లెక్కలు, ఊహల్లో రకరకాల అంచనాల్లో కేసిఆర్ మునిగిపోయారు.

కేసిఆర్ కు నేతలు షాక్..?

అందుకే తన రాష్ట్రాన్ని, తన పార్టీని తన వారుసుడికి అప్పజెప్పి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు కేసిఆర్. కానీ మొదటి దెబ్బ కేసిఆర్ కు జగన్ వద్దనే పడింది. కేసిఆర్ మాట పూర్తిగా జగన్మోహనరెడ్డి వినడం లేదు. అలా వినాలంటే జగన్మోహనరెడ్డి పూర్తిగా బీజేపీకి దూరం అవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ బీజేపీని దూరంగా ఉండే పరిస్థితులు లేవు. ఇక స్టాలిన్, శివసేన, ఎన్సీపీ కూడా పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ప్రశాంత్ కిషోర్ (పీకే) తెరవెనుక ఉండి కేసిఆర్ ను నడుపుతున్నారు. ఇప్పుడు కేసిఆర్ వల్ల కాకపోతే మమతా బెనర్జీ ద్వారానో లేక అరవింద్ కేజ్రీవాల్ ద్వారానో తర్వాత ప్లాన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం వీళ్లంతా కేసిఆర్ కు షాక్ ఇచ్చినట్లే చెప్పుకోవచ్చు.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?