NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet: 7న ఏం జరగబోతుంది..!? క్యాబినెట్ భేటీకి హాట్ హాట్ టాపిక్స్ సిద్దం..!

AP Cabinet: ఈ నెల 7వ తేదీన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ బేటీ జరగనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 3వ తేదీన కేబినెట్ బేటీ నిర్వహించాలని తలపెట్టినప్పటికీ ఇటీవల అకాల మృతి చెందిన మంత్రి గౌతమ్ రెడ్డి వైదిక కార్యక్రమాల కారణంగా 7వ తేదీకి వాయిదా వేశారు. 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

7th AP Cabinet meet
7th AP Cabinet meet

AP Cabinet: వికేంద్రీకరణ బిల్లు పై ఎలా ముందుకు వెళ్లాలి..?

సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రాజధాని అభివృద్ధి చేయాలని, రాజధానిలోని ప్రధాన కార్యాలయాలు తరలించడానికి వీలులేదంటూనే గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజధాని వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే న్యాయపరమైన చిక్కులు రాకుండా మెరుగైన విధంగా పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం యోచన చేసింది. అయితే రాజధానిపై  హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏమి చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి..? అనే దానిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా..? కొత్త గా బిల్లు తీసుకురావాలా..? వద్దా.. మూడు రాజధానులపై కేంద్రం ఆమోదానికి ప్రతిపాదనలు పంపాలా..? ఇలా అన్ని రకాలుగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.

AP Cabinet: జిల్లాల పునర్విభజన అంశంపైనా

రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి నిరసనలు, విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రం, డివిజన్ ల ఏర్పాట్లలో తమకు అన్యాయం జరిగిందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారితో పాటు అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల నుండి అభ్యంతరాలను స్వీకరించింది. ఈ జిల్లాల పునర్విభజన అంశంపైనా పూర్తి స్థాయిలో కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ రెండు ప్రధాన అంశాలతో పాటు బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju