NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ganta Srinivas: గంటా ..ఒక్క దెబ్బతో రెండు న్యూ ప్లాన్స్ ..! బేరమా.. రాయబారమా..!?

Ganta Srinivas: ఏపి రాజకీయాల్లో ప్రత్యేక చరిత్ర ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలో వందలాది మంది ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉన్నా గంటా శ్రీనివాసరావు రాజకీయ శైలి ముందు ఎవరూ  సరిపోరు. పార్టీలు మారడం, నియోజకవర్గాలు మారడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఒక పార్టీతో సెంటిమెంట్ ఉండదు. ఒక్క నియోజకవర్గ ఓటర్లతో ఏమోషన్ అటాచ్ మెంట్ ఆయనకు ఉండదు. వాస్తవానికి రాజకీయ నాయకుడు అంటే ప్రజలతో ఏమోషన్ కనెక్షన్ ఉండాలి. గెలిచినా ఓడినా వాళ్ల కోసమే అన్నట్లుగా ఉండాలి. కానీ అటువంటి క్వాలిటీస్ ఏమి లేని నాయకుడు గంటా శ్రీనివాసరావు. కనీసం నాకు ఈ పార్టీ అంటే ఇష్టం, ఈ పార్టీ అంటే ప్రాణం అన్నది అయినా ఉండాలి. కానీ ఈయనకు అదీ కూడా లేదు. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ పక్కన బెడితే..ఆయన భవిష్యత్తు రాజకీయ అడుగులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ఆయన రాజీనామాను ఎవరూ కోరలేదు. ఆయనంతట ఆయనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ కు లేఖ రాశారు. రాజీనామాను ఆమోదించకపోవడంతో గత వారం స్పీకర్ కు మరో లేఖ రాశారు. తాను రాజీనామా చేసి ఏడాది గడుస్తున్నా ఇంత వరకూ ఆమోదించలేదు. వెంటనే రాజీనామా ఆమోదించాలని లేఖలో కోరారు.

Ganta Srinivas political strategy
Ganta Srinivas political strategy

Read More: TDP Janasena: టీడీపీకి డేంజర్ డేస్ ..!? అభద్రత, ఆందోళనలో క్యాడర్..!

Ganta Srinivas: అనకాపల్లి, గాజువాక, లేదా చోడవరం నుండి రాబోయే ఎన్నికల్లో పోటీ ?

ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్యేగా ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకు ప్రతిపక్షంలో ఉండలేరు. అధికారంలో లేకుండా ఎమ్మెల్యేగా ఉండటం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకే ఆయన ప్రజలు ఇచ్చిన బాధ్యత నుండి తప్పుకోవడానికి సిద్ధమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొరకు రాజీనామా అనేది ఒక సాకు మాత్రమే. రాష్ట్ర స్థాయిలో కాపు సామాజిక వర్గం నేతలను ఏకం చేయాలని, రాష్ట్ర స్థాయిలో ఆ సామాజిక వర్గ నేతగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఆయనకు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ప్రేమ ఉంటే.. వాళ్లతో పాటు నిరాహార దీక్షలు, ఆందోళనలో పాల్గొంటూ రాష్ట్ర స్థాయి ఉద్యమంగా ఎందుకు చేయన్నట్లు. ఇప్పుడు ఆయన న్యూ స్ట్రాటజీ ఏమింటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, కొత్త పార్టీని ఎంచుకోవడం, కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకోవడం. విశాఖ ఉత్తరం నుండే మళ్లీ పోటీ చేయడం అంటే కుదరదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి చేసింది ఏమి ఉండదు కాబట్టి. రాబోయే ఎన్నికల నాటికి అనకాపల్లి, గాజువాక, లేదా చోడవరం ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు. ఏ పార్టీ నుండి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దాదాపుగా జనసేన నుండి గంటా పోటీ చేయవచ్చు అనే మాటలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఆయన కాపు సామాజికవర్గ నేతలను ఏకం చేసే పనిలో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ, జెడి (వీవీ) లక్ష్మీనారాయణ. మరి కొందరు కాపు సామాజికవర్గ నేతలతో తరచు మీటింగ్ లు నిర్వహిస్తున్నారు.

జనసేనలోకే జంప్..?

గంటా శ్రీనివాసరావు. కాపు సామాజికవర్గ నేతలకు నాయకత్వం వహిస్తున్నందున తనను పార్టీలో చేర్చుకుని సముచిత స్థానం ఇస్తే తనతో పాటు ఇంత మంది పార్టీలో చేరతారు. నా వెనుకే వీళ్లంతా ఉన్నారు అని చెప్పుకోవడానికి వీలు అవుతుంది. ఆయన ఇప్పటి వరకూ వెళ్లని పార్టీ జనసేన ఒక్కటే కావడం వల్ల ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీలో చేరేందుకు తొలుత ప్రయత్నాలు చేసినా ఆ పార్టీ తలుపులు తెరుచుకోలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పూర్తి అయ్యాయి. బీజేపీలో వెళితే ఏపిలో ఆ పార్టీ సింబల్ కు ఓట్లు రావడం కష్టం. టీడీపీలో ఉనికి లేదు. ఒక వేళ కొనసాగినా సీటు ఇస్తారో లేదో డౌటే. అందుకే జనసేన లోకి వెళతారని అనుకుంటున్నారు. తన రాజీనామా ఆమోదిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా తాను ఒక్కడినే రాజీనామా చేశాననీ ప్రజలలోకి వెళ్లేందుకు మంచి అస్త్రం లభించినట్లు అవుతుంది. మరో పక్క సామాజికవర్గం పేరుతో ఆ పార్టీలో తన హవా కొనసాగించుకోవడానికి వీలు ఉంటుంది. ఇదీ గంటా లెక్క.

 

 

 

 

 

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju