Bhavadeeyudu Bhagathsing: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “గబ్బర్ సింగ్” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. వరుస పరాజయాలతో ఉన్న పవన్ కళ్యాణ్ కి “గబ్బర్ సింగ్” మంచి కం బ్యాక్ మూవీ అయింది. పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఏ విధంగా చూడాలి అని అప్పట్లో అనుకునేవాళ్లో… ఆ రీతిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హరీష్ చూపించి అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నాడు. హిందీలో “దబాంగ్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ తెలుగు నేటివిటీకి దగ్గరయ్యే రీతిలో హరీష్ మార్పులు చేసి.. బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పైగా హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావడంతో అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ హరీష్ కి ఏర్పడింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా వస్తూ ఉండటంతో.. ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “భవదీయుడు భగత్ సింగ్ ” అనే టైటిల్ పేరిట పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ రెండో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గత ఏడాది పవన్ పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రకటించడం జరిగింది. రేపటి వరకు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కాలేదు. మరోపక్క పవన్ కళ్యాణ్ నీ రాజకీయంగా ఫుల్ బిజీ అవుతున్నాడు. ఇదే సమయంలో క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా కూడా చేస్తున్నారు.
దీంతో హరీష్ సినిమా పై అభిమానులు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో “భవదీయుడు భగత్ సింగ్ ” సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో… ఎక్కడ షూటింగ్ జరుపుకుంటుందో.. వంటి వాటి గురించి హరీష్ శంకర్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలిపారు. దాదాపు 80 శాతం షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుందని కొద్దిగా ఇంకా అవుట్ డోర్ అయితే ఊటీ లో… జరుపుకుంటుదన్ని హరీష్ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ టైం లెక్చలర్ పాత్రలో పవన్ కళ్యాణ్.. కనిపిస్తున్నారు. “భవదీయుడు భగత్ సింగ్ ” కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుంది అని హరీష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో.. చేస్తున్నారు.