NewsOrbit
Telugu TV Serials

హిమ,నిరూపమ్ ల పెళ్లి చేస్తా అంటున్న సౌర్య.. మరి నిరూపమ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు.?

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్యను, నిరూపమ్ ను ఎలాగయినా కలపాలి అని. హిమ, ప్రేమ్ ప్రయత్నాలు చేస్తారు. అలాగే హిమను, సౌర్యను ఇంట్లోనే ఉంచాలని. సౌందర్య, ఆనందరావు కూడా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే నేటి. ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.సౌర్య ఆటో రిపేర్ అవ్వడంతో సౌర్యను ఎలాగయినా ఆపాలని సౌందర్య తాతయ్యకు బాగోలేకపోతే.. కాసేపు ప్రేమగా కబుర్లు చెప్పొచ్చుగా.. ఆయన సంతోషంగా ఉంటారు’ అంటుంది.దాంతో సౌర్య ఆటో దిగి ఇంట్లోకి వెళ్తుంది.సరిగ్గా అప్పుడే నిరుపమ్,హిమలు ఆనందరావుని జాగ్రత్తగా మెట్ల మీద నుంచి కిందకు దింపి సౌందర్యకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు

నిరుపమ్ ను దక్కించుకోవడానికి శోభ చేసిన ప్లాన్ ఏంటి :

ఇక శోభ ఇంటికి వెళ్లి కోపంతో అన్నీ వస్తువులు పగలగొడుతుంది. నిరుపమ్ నాకు ఎలా దక్కుతాడు? బ్యాంక్ వాళ్లని ఎలా ఆపాలి?ఏదొకటి చెయ్యాలి అంటూ తలపట్టుకుంటుంది. ఇంతలో ఓ ఫోన్ వస్తుంది. అవతల ఎవరో? ఏం మాట్లాడారో తెలియదు కానీ.. అలాగే అంటుంది శోభ.

హిమ మాట్లాడిన మాటలు విన్న నిరూపమ్ :

మరోవైపు తన రూమ్‌లో దీప, కార్తీక్‌ల ఫోటోల దగ్గర నిలబడి హిమ బాధపడుతుంది.బావ మారట్లేదు. సౌర్యకు కోపం తగ్గట్లేదు. అందుకే సౌర్యకి ఏది ఏమైనా ఈ రోజు నిజం చెప్పేస్తాను. నేను చేసే ప్రయత్నాల గురించి చెబుతా అంటుంది.వెనక్కి తిరిగే సరికి నిరుపమ్ ఉంటాడు. అంతా వినేస్తాడు. ‘బాావా నువ్వు ఎప్పుడు వచ్చావ్’ అంటుంది హిమ ఆ షాక్‌లోనే. ‘సౌర్య ఎక్కడుంది?’ అంటాడు నిరుపమ్ కోపంగా.‘తన రూమ్‌లో ఉంది’ అంటుంది హిమ. ‘సరే తనతో నేను మాట్లాడాలి. కాసేపు ఇక్కడే ఉండు’ అనేసి నిరుపమ్ సౌర్య రూమ్‌కి వెళ్తాడు. అప్పటికి నిరుపమ్ రక్తంతో గీసిన బొమ్మని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది సౌర్య. అది చూసిన నిరుపమ్ మనసు చివుక్కుమంటుంది.

హిమతో నా పెళ్లి చేయమని సౌర్యను అడిగిన నిరూపమ్ :

సౌర్యా నీకో విషయం చెప్పాలి’ అంటాడు నిరుపమ్.డాక్టర్ సాబ్ వెళ్లిపొండి’ అంటుంది సౌర్య. ‘నువ్వు వెళ్లిపో అంటే వెళ్లిపోవాలా ఏంటీ? అంటాడు.నువ్వు ఒకప్పుడు ఏం అన్నావ్.. మీ మనసు చెప్పేది వినండి అన్నావ్.. నువ్వు చెప్పిందే నేను చేశాను. నేను హిమని ప్రేమించాను సౌర్యా..’ అంటాడు నిరుపమ్. ‘అవన్నీ నాకెందుకు చెబుతున్నారు అని సౌర్య అంటే..నా పెళ్లి మా మమ్మీకి ఇష్టం లేదు.. హిమని మార్చిన నువ్వే మా మమ్మీ మనసు మార్చాలి.మా ఇద్దరి పెళ్లి నువ్వే చెయ్యాలి.నన్ను, హిమని ఒక్కటి చెయ్ సౌర్య అంటాడు నిరుపమ్. అప్పుడే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది హిమ.అప్పుడే సౌందర్య, ఆనందరావులు ఆ రూమ్‌లోకి వస్తారు.

నిరూపమ్ ను హిమ మెడలో తాళి బొట్టు కట్టమన్న సౌర్య:

బాగుంది.. చాలా బాగుంది అంటూ అక్కడ నుంచి హాల్లోకి వెళ్తుంది సౌర్య.వెనుకే నిరుపమ్, హిమ, సౌందర్య, ఆనందరావులు వెళ్తారు. హాల్లో నిలబడి ఉండగానే.. సౌర్య ఎదురు వస్తుంది పసుపు తాడుతో. నిరుపమ్ ముందు పెట్టి కట్టు’ అంటుంది హిమవైపు చూపిస్తూ. ‘చూస్తారేంటీ డాక్టర్ సాబ్ ఇది మెడలో కట్టండి..’ అంటుంది.మీరిద్దరూ అమర ప్రేమికులు.మీ ప్రేమ, మీ డ్రామా చూసి చూసి విసుగెత్తిపోయింది. ప్రేమ అని ఒకరు అంటారు. పెళ్లి అని ఇంకొకరు అంటారు.. ఇష్టం అని ఒకరు అంటారు.. ఇష్టం లేదని ఇంకొకరు అంటారు. ఏంటిది?ఈ తాళి బొట్టు తన మెడలో కట్టండి. ఈ మహా నాటకానికి తెర పడుతుంది అంటుంది సౌర్య. వెంటనే నిరుపమ్ పసుపు తాడు అందుకుంటాడు.

బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పిన హిమ :

బావా ఆగు.నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నాను కదా’ అంటుంది హిమ. ‘ఆపవే.. నీ నంగనాచి మాటలు.. అసలు నేను నీకు ఏ ద్రోహం చేశానే..? నా జీవితంలో ఆటలు ఆడుతున్నావ్ కదే.. నేను నీకు ఎప్పుడైనా అడ్డు వచ్చానా? అంటూ సౌర్య ఏడుస్తూ ఉంటుంది.ఏంటే ఇది’ అంటుంది సౌందర్య. ‘మీకు తెలియదు నాన్నమ్మా ఈ మహా తల్లి లీలలు’ అంటూ సౌర్య ఏడుస్తూ తన రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. వెంటనే పైకి లేచి.. ‘ఛాఛా నేను ఏడవడం ఏంటీ? నేనెందుకు ఏడుస్తాను’ అని కళ్లు తుడుచుకుంటుంది.

నిరూపమ్ తుది నిర్ణయం ఏంటంటే..?

ఇక నిరుపమ్ హిమా నీకో విషయం చెబుతాను జాగ్రత్తగా విను.నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మనసుని మార్చలేవు.నేను జీవితాంతం నీతోనే కలిసి ఉంటాను.నిన్నే పెళ్లి చేసుకుంటాను. చచ్చేదాకా నీతోనే కలిసి ఉంటాను అంటాడు.అది కాదు బావా’ అని హిమ ఏదో చెప్పబోతుంటే.. ‘వాడు అంత క్లారిటీ చెబుతుంటే ఇంకా ఏంటే’ అంటుంది సౌందర్య. నువ్వు ప్రేమించిన మనిషే నిన్ను చేసుకుంటాను అంటున్నప్పుడు ఈ త్యాగాలెందుకమ్మా’ అంటాడు ఆనందరావు. హిమ మౌనంగా చూస్తూ ఉండడంతో ఈరోజు సీరియల్ ముగుస్తుంది.

Related posts

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu