తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అల్లరించే షోలలో బిగ్ బాస్ షో ఒకటి. తెలుగులో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉంది. అయితే తెలుగులో ఇప్పటివరకు ఐదో సీజన్ లు ప్రసారమయ్యాయి. అన్నీ కూడా పరవాలేదు అనిపించాయి. తెలిసిన సెలబ్రిటీలను రకరకాల టాస్కులతో… వారి మధ్య పోటీ వాతావరణం సృష్టించటంతో పాటు గొడవలు పెట్టడం ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయటం బయట ప్రపంచానికి దూరంగా ఉంచి.. చూసే ఆడియన్స్ కి సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించడం బిగ్ బాస్ షో స్పెషాలిటీ. ఇదిలా ఉంటే కరోనా వైరస్ రాకముందు వచ్చిన తర్వాత ఈ షోలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
షో స్టార్ట్ అయ్యాక హౌస్ లోకి అతిథులు వెళ్లాలన్న వాళ్లు ముందుగానే క్వారెన్ టైన్ లో కొన్ని రోజులు ఉండాలి. ఇక అంతకు ముందు కరోనా ప్రభావం లేని టైంలో ఎవరైనా.. గెస్ట్ హౌస్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ లో మాదిరిగానే హౌస్ లో ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్ ల షూటింగ్ రోజుకి ఇద్దరు ముగ్గురిని కవర్ చేసే రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈనెల 29, 30వ తారీఖున రెండు రోజులపాటు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ క్వారెన్ టైన్ లో ఉండనున్నరట. ఆ తర్వాత నుండి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ లకి సంబంధించి ఇంట్రడక్షన్ సాంగ్స్ షూటింగ్ ప్రారంభం కానుంది.
అందుకనే వారి పాటలకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ నాలుగో తారీఖు హోస్ట్ నాగార్జున వాళ్ళని హౌస్ లోకి పంపించే రీతిలో సీజన్ 5 మాదిరిగా షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. సీజన్ సిక్స్ నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఈ క్రమంలో హౌస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫిజికల్ టాస్క్ లు కూడా ఉండనున్నాయట. ఎక్కడ కూడా షో ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఎలిమెంట్స్ ముందుగానే బయటకు రాకుండా.. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కఠినమైన నిర్ణయాలు షో నిర్వాహకులు తీసుకున్నట్లు టాక్. ఏది ఏమైనా ఈ వారం నుండే బిగ్ బాస్ సీజన్ 6.. ప్రారంభం కానున్నట్లు సమాచారం.