NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుపై సెటైర్ల మీద సెటైర్లు వేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

13 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఏమి చేశారని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలు జరగాలనేది తమ ఉద్దేమని స్పష్టం చేశారు. ఏపి అసెంబ్లీలో వికేంద్రీకరణపై స్పల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ  చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మించారా ? విజయవాడ, అమరావతి అభివృద్ధి చేశారా ? ఇంటింటికి రేషన్ అందించారా.?  ప్రజలకు పాలన దగ్గర చేసేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 13 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ పెద్ద మనిషి చివరకు కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ తనకు లేఖ రాశారని, ఆయన అధికారంలో ఉండగా గాడదలు కాశారా అని ప్రశ్నించారు.

AP CM YS Jagan

 

టీడీపీకి ఇప్పుడు వచ్చిన 23 స్థానాలు కూడా వచ్చే ఎన్నికల్లో రావని, చివరకు కుప్పం కూడా గెలవదని అన్నారు. తనకు అమరావతిపై ఎలాంటి కోపం, వ్యతిరేకత లేదని తెలిపారు. చంద్రబాబు హయాంలో అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. అమరావతితో పాటు కర్నూలు, విశాఖ కూడా అభివృద్ధి చెందాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఏపి అంటే 3.59 కోట్ల ఎకరాల భూభాగమని, కేవలం 50వేల ఎకరాల భూమి మాత్రమే కాదని అన్నారు. కేవలం 10వేల కోట్ల రూపాయలతో విశాఖను అభివృద్ధిలో ఎక్కడికో తెలుకెళ్లవచ్చని పేర్కొన్నారు. విశాఖ అయినా అమరావతి అయినా తనకు సమానమేనని స్పష్టం చేశారు. ఏపిలో అతి పెద్ద నగరం విశాఖ అని గుర్తు చేస్తూ కొన్ని సౌకర్యాలు మెరుగుపరిస్తే పరిపాలనా రాజధానిగా మారుతుందని అన్నారు. అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని స్పష్టం చేశారు సీఎం జగన్.

AP Assembly

 

రాష్ట్రం విడిపోయినప్పుడు గానీ హైదరాబాద్ నుండి తరలివచ్చేటప్పుడు గానీ ఎలాంటి ఉద్యమాలు చేయని చంద్రబాబు.. అభివృద్ధి చేయలేని ప్రాంతం గురించి ఉద్యమాలు చేయిస్తున్నారంటూ విమర్శించారు. ఉద్యమాల పేరుతో రకరకాల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్షల కోట్లు కావాలన్నారు. కట్టని, కట్టలేని గ్రాఫిక్స్ రాజధాని గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని చేస్తున్నారంటూ విమర్శించారు జగన్. ఉద్యమం పేరుతో రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరి అభివృద్ధి కోసం వీరంతా ఉద్యమాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ అభివృద్ధి కోసమా.. అవేమీ కాదు, పెత్తందారుల అభివృద్ధి కోసమే అమరావతి రైతుల అద్యమం అని అన్నారు. వాళ్ల బినామీ భూములు ఉన్న చోటే రాజధాని ఉండాలని భావిస్తున్నారని ఆరోపించారు.

ఈ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం కోసం లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలు, పేదలకు ఇళ్లు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. దోచుకో..దాచుకో.. పంచుకో ఇదే నాటి టీడీపీ సిద్ధాంతమని తూర్పారబట్టారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్థత్వమని విమర్శించారు. అక్రమ వ్యాపారాలు చేసే వాడైనా తమ వాడై ఉండాలనే తత్వం ఆయనది అని అన్నారు.  “ఇసుక నుంచి నూనెను పిండచ్చు, ఎండమావిలో నీళ్ళు తాగచ్చు, వెతికి వెతికి కుందేటి కొమ్మునూ తెచ్చుకోవచ్చు కాని మూర్ఖుని మనసును రంజింపచేయలేము” అని భక్తృ శ్రీహరి చెప్పిన సుభాషితం వినిపించిన సీఎం జగన్.. చంద్రాబాబుది మూర్ఖుడి మనస్థత్వం అని ఆయన మనసును ఎవరూ మార్చలేరు అంటూ ఘాటుగా విమర్శించారు.  సీఎం జగన్. జగన్ ప్రసంగం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం సభను రేపటికి వాయిదా వేశారు.

ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?