Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండోవారం పోటీదారులలో ఇనాయ సుల్తానా ఒకరు. మొదటి వారంలో హౌస్ లో దాదాపు చాలామంది ఈమెనే టార్గెట్ చేయడం జరిగింది. వీకెండ్ ఎపిసోడ్ లో సైతం హౌస్ లో 14 మంది ఇనాయ సుల్తానాకి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు తెలియజేశారు. కానీ రెండవ వారం వచ్చేసరికి ఇనాయ పూర్తిగా తన గేమ్ చేంజ్ చేసింది. పెద్దగా ఎవరిని నమ్మకుండా ఫిజికల్ టాస్క్ ఇంకా అన్ని విషయాలలో అద్భుతంగా తన ఆట తీరు మెరుగుపరుచుకుంది.
చివర ఆఖరికి రెండో వారం కెప్టెన్సీ పోటీదారులలో ఒకరిగా నిలిచింది. అయితే రెండో వారం కెప్టెన్ ఎంపీక పూర్తిగా ఇంటి సభ్యుల చేతిలో బిగ్ బాస్ పెట్టడం తెలిసిందే. ఓటింగ్ పరంగా ఎన్నుకునే అవకాశాన్ని బిగ్ బాస్ మిగతా హౌస్ మేట్స్ కి అందించారు. అయితే ఇంటి సభ్యులంతా తమ ఓట్లు… చంటి, సూర్య, రాజ్ కే వేస్తూ ఉండటంతో ఇనాయ సుల్తానా కన్నీరు పెట్టుకోంది. వాసంతి దగ్గర ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది. ఎంతో కష్టపడి టాస్క్ లు గెలిచి.. ఇక్కడిదాకా వస్తే కనీసం హౌస్ లో ఒక్కరు కూడా.. నా పట్ల శ్రద్ధ చూపించడం లేదు, సపోర్ట్ చేయడం లేదంటూ ఎమోషనల్ అయ్యింది.
ఇదే సమయంలో రాజ్ గెలవడం తనకు సంతోషమే అని కూడా తెలిపింది. “ఐస్ క్రీమ్ టైం” అనే టాస్క్ లో రాజ్ గెలవడంలో తానే హెల్ప్ చేసినట్లు..ఇనాయ చెప్పుకొచ్చింది. అందరితో బాగున్నా గాని నన్ను ఎందుకు.. గుర్తించడం లేదంటూ కన్నీరు పెట్టుకుని.. రాబోయే రోజుల్లో మరింత స్ట్రాంగ్ గా టాస్క్ లు ఆడతానని తెలిపింది.