NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ వేదికగా మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఇవేళ ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ నందు సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఇన్వెస్టర్లను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఏపిలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్దమని ప్రకటించారు.

AP CM YS Jagan

 

ప్రపంచ వేదికపై ఏపిని నిలబెట్టేందుకు ఇన్వెస్టర్ల సహకారం అవసరమన్నారు సీఎం వైఎస్ జగన్ . ఈ విషయంలో ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి గత మూడేళ్లుగా నెంబర్ వన్ గా ఉంటోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపిలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను సీఎం జగన్ ఇన్వెస్టర్లకు వివరించారు.  పారిశ్రామిక వేత్తలు ఇచ్చి ఫీడ్ బ్యాక్ తోనే తాము నెంబర్ వన్ గా ఉన్నామని చెప్పారు. ఏపికి సుదీర్ఘ తీర ప్రాతం ఉందని తెలిపారు. 11.43 శాతం వృద్ది రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్ లలో మూడు ఏపికే రావడం శుభపరిణామని పేర్కొన్నారు. సింగిల్ డెస్క్ సిస్టమ్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

AP CM YS Jagan Global investors meeting
AP CM YS Jagan Global investors meeting

 

ఏపి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. బల్క్ డ్రగ్, స్పైస్ పరిశ్రమల నెలకొల్పేందుకు మంచి అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిరంతర విద్యుత్, ల్యాండ్ బ్యాంక్ సమృద్ధిగా ఉందని వివరించారు.

AP CM YS Jagan Global investors meeting

 

ఈ సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఇండియా సెయింట్ గోబైన్ సీఈఓ బి సంతానం, ఎవర్టన్ టీ ఇండియా డైరెక్టర్ రోషన్ గణవర్థన, టోరే ఇండస్ట్రీస్ ఎండీ యమగూచి, క్యాడ్ బరీ ఇండియా ప్రెసిడెంట్ దీపక్, కియా మోటర్స్ ఎండీ, సీఈఓ తాయి జిన్ తదితరులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.

Breaking: అచ్చుతాపురం సెట్ లో భారీ పేలుడు .. ఒకరు మృతి

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju