NewsOrbit
టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

Amaravati Capital Case: అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ ను సుప్రీం కోర్టు డిసెంబర్ కు వాయిదా వేసింది. పూర్తి స్థాయి విచారణ డిసెంబర్ లో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది దర్మాసనం వెల్లడించింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనను సుప్రీం ధర్మాసనం తోసి పుచ్చింది. డిసెంబర్ లోపు విచారణ సాధ్యం కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. ఆగస్టు నుండి నవంబర్ వరకూ రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. 

Supreme Court Shocks AP Govt in Amaravti Case:  రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా

అమరావతి కేసుపై వాదనలు వినిపించేందుకు మూడు గంటల సమయం కావాలని సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరారు. ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తి అయ్యిందా అని ధర్మాసనం ప్రశ్నించగా,  ప్రతివాదుల్లో ఇద్దరు మృతి చెందారని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు వెల్లడించారు. మృతి చెందిన వారిని జాబితా నుండి తొలగించాలని ఏపి ప్రభుత్వం కోరింది. మృతి చెందిన వారిని జాబితా నుండి తొలగించినట్లయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్లేనని ప్రభుత్వ న్యాయవాది తెలియజేయగా, ఇంకా మరి కొందరికి నోటీసులు అందలేదని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు,. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ ను లీడ్ మ్యాటర్ గా పరిగణిస్తూ తదుపరి విచారణను ఈ ఏడాది డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

జగన్మోహనరెడ్డి సర్కార్ మూడు రాజధానులకు కట్టుబడి ఉంది. ఇప్పటికే పలు మార్లు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ గా పేర్కొంటున్న విశాఖ నుండి పరిపాలన సాగించేందుకు సీఎం జగన్ మూహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. త్వరలో సుప్రీం కోర్టు నుండి అనుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాభావంతో వైసీపీ పెద్దలు ఉన్నారు. ఆ క్రమంలోనే సెప్టెంబర్ లో విశాఖకు తన మకాం మార్చి పరిపాలన సాగించనున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం రాజధాని కేసును డిసెంబర్ నెలకు వాయిదా వేయడం ప్రభుత్వానికి షాకింగ్ పరిణామంగా భావిస్తున్నారు.

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?