బరువు తగ్గిన తర్వాత అనుష్క రెండు సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి `నిశ్శబ్దం` కాగా మరో చిత్రం మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి`. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో అనుష్కది ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్. `అరుంధతి`, `రుద్రమదేవి`చిత్రాల్లో అనుష్కకత్తి యుద్ధాలు కూడా చేసింది. అయితే ఇప్పుడు ఈమె సైరా కోసం మరోసారి కత్తి పట్టనుందని సమాచారం. బ్రిటీష్ వారితో కత్తి పట్టి యుద్ధం చేసే అనుష్క పాత్రతోనే సినిమా నెరేషన్ స్టార్ట్ అవుతుందట. అనుష్క పాత్రకు సంబంధించిన చిత్రీకరణంతా పూర్తయ్యిందట.
తొలి భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్చరణ్ నిర్మాత. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post