(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇళ్లలో కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను పెంచడం సాధారం. పెంపుడు జంతువులు విశ్వాసంగా ఉంటాయని నమ్ముతారు. అయితే, కుక్కలు విశ్వాసంగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. కానీ కొలంబియాలో జరిగిన ఓ ఘటన చూస్తే పిల్లులకు కూడా విశ్వసం ఉంటుందని నమ్మకం కలుగుతుంది. సామ్యూల్ లియోన్ అనే ఏడాది వయసున్న పిల్లడిని ఓ గదిలో తొట్టిలో వదిలేసి ఇంటి పనుల్లో బిజీ అయ్యింది అతని తల్లి. అయితే, ఆ పిల్లాడు తొట్టిలో నుంచి కిందికి దిగి ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ మెట్లవైపుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పిల్లి సామ్యూల్ని చూసి.. పరిగెత్తుకెళ్లి మెట్లవైపుకు వెళ్లకుండా అడ్డుకుంది. సామ్యూల్ని ప్రమాదం నుంచి రక్షించింది. ఈ దృశ్యమంతా సీసీటీవీలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.