NewsOrbit
న్యూస్

ప్రియాంక కేసులో ముగ్గురు పోలీసుపై వేటు!

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంకారెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు నిజమని తేలడంతో శంషాబాద్‌ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్య నారాయణ గౌడ్ లను సస్పెండ్ చేశారు. ప్రియాంక తల్లితండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలతో ఈ వేటు పడింది.

ప్రియాంకారెడ్డి హత్య కేసులో ఆది నుంచి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తన కుమార్తె ప్రియాంక అదృశ్యం అయిందని, ఆమె తల్లిదండ్రులు నవంబర్ 27వ తేదీ రాత్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రియాంక సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అవుతోందని, ఆమె ఆచూకీ తెలియడం లేదని శంషాబాద్ పోలీసులకు తొలుత ఫిర్యాదు అందగా, వారు స్పందించకుండా, ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదని చెప్పారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు పోయేవి కాదని ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు.. ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. ప్రియాంక తల్లిదండ్రులు ముందుగానే సమాచారం ఇచ్చినా, పోలీసులు స్పందించలేదని తేలడంతో తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వారిపై చర్యలు తీసుకున్నారు. ఎవరైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Related posts

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Leave a Comment