NewsOrbit
రివ్యూలు

`90 ఎం.ఎల్` రివ్యూ&రేటింగ్‌

 

డిఫ‌రెంట్ క‌థాంశాల‌తో యువ ద‌ర్శ‌కులు సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి యెర్ర ఓ సిండ్రోమ్‌ను ఆధారంగా చేసుకుని ఓ సినిమాను తెర‌కెక్కించాడు. హీరోల‌కు సిండ్రోమ్ ఉండే కాన్సెప్ట్ కామ‌నే క‌దా! ఇందులో కొత్తేముందీ అనుకోవ‌చ్చు. కానీ ఫాట‌ల్ ఆల్క‌హాలిక్ సిండ్రోమ్‌(అంటే మూడు పూట‌ల మందు తాగ‌క‌పోతే ప్రాణం పోతుంది) అనే పాయింట్‌తో శేఖ‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం `90 ఎం.ఎల్‌`. `ఆర్‌.ఎక్స్ 100` త‌ర్వాత మ‌రో హిట్ అందుకోని హీరో కార్తికేయ ఇందులో హీరోగా న‌టించాడు. అస‌లు ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకున్నాడు?  అనే విష‌యం తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం

బ్యాన‌ర్‌:  కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్‌
న‌టీన‌టులు: కార్తికేయ‌, నేహా సోలంకి, ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, అజయ్ , ఆలీ , ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, అదుర్స్ ర‌ఘు, స‌త్య ప్ర‌కాష్‌, రోల్ రిడా, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు
సంగీతం: అనూప్ రూబెన్స్
కెమెరా: జె.యువ‌రాజ్‌
ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌
పాట‌లు: చంద్ర‌బోస్‌
నిర్మాత : అశోక్‌రెడ్డి గుమ్మకొండ
రచన-దర్శకత్వం :శేఖర్ రెడ్డి ఎర్ర .

క‌థ‌:
దేవ‌దాస్‌(కార్తికేయ‌)కి పుట్టుక‌తోనే ఆల్క‌హాలిక్ సిండ్రోమ్ వ‌చ్చేస్తుంది. దాంతో అత‌ను మూడు పూట‌ల మందు తాగాల్సిందేన‌ని డాక్ట‌ర్ చెప్పేస్తాడు. పెద్ద‌వాడైన దేవ‌దాస్ మూడు పూట‌ల మూడు 90 ఎం.ఎల్ తాగ‌క‌పోతే ఇబ్బందులు వ‌చ్చేస్తుంటాయి. దాంతో దేవదాస్ త‌న జాగ్ర‌త్త‌ల్లో త‌నుంటాడు. సిండ్రోమ్ మిన‌హా దేవదాస్ చాలా మంచి వ్య‌క్తి. ఇత‌రుల‌కు స‌మ‌స్య ఉంటే రియాక్ట్ అవుతుంటాడు. ఆ క్ర‌మంలో సువాస‌న‌(నేహా సోలంకి) అత‌న్ని ప్రేమిస్తుంది. ఆమె తండ్రి క్షుణ్ణారావు(రావు ర‌మేశ్‌)కి తాగుబోతులంటే ప‌డ‌దు. సువాస‌న‌కి, ఆమె ఇంట్లోవాళ్ల‌కి తెలియ‌కుండా దేవ‌దాస్ జాగ్ర‌త్త ప‌డుతుంటాడు. ఓ సంద‌ర్భంలో దేవదాస్ మూడు పూట‌ల మందు తాగుతాడ‌నే నిజం సువాస‌న‌కి తెలుస్తుంది. అయితే ఆమె కార‌ణం తెలుసుకోకుండా దేవ‌దాస్‌కి దూర‌మ‌వుతుంది. అదే స‌మ‌యంలో వ్యాపార‌వ్తేత జాన్‌స‌న్‌(రవికిష‌న్‌) ఆమెను పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అస‌లు జాన్ స‌న్ ఎవ‌రు?  అత‌నితో దేవ‌దాస్‌కి ఉన్ గొడ‌వేంటి?  చివ‌ర‌కు దేవ‌దాస్ త‌న స‌మ‌స్య‌ను  అధిగ‌మించాడా?  ప్రేమ‌ను గెలుచుకున్నాడా?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌:
న‌టీన‌టులు విషయానికి వ‌స్తే కార్తికేయ యూత్‌ను ఆక‌ట్టుకునేలా ఓ డిఫ‌రెంట్ పాయింట్‌ను ఎంచుకున్నాడు. అందుకు త‌గిన‌ట్లు హీరోయిక్‌గా న‌టించాడు. ప్రేక్ష‌కుల‌ను కార్తికేయ మెప్పించాడు. ఇక నేహా సోలంకి పాత్ర డీసెంట్‌గా ఉంటుంది. హీరో త‌ల్లిదండ్రులుగా స‌త్య‌ప్ర‌కాశ్‌, ప్ర‌గ‌తి న‌టించారు. ముఖ్యంగా విల‌న్‌గానే న‌టిస్తూ వ‌చ్చిన స‌త్య‌ప్ర‌కాశ్ ఇందులో సాఫ్ట్ క్యారెక్ట‌ర్ చేయ‌డం విశేషం. ఇక రావుర‌మేశ్ స్ట్రిట్ హీరోయిన్ ఫాదర్ రోల్‌ను సునాయ‌సంగా త‌న‌దైన స్టయిల్లో ర‌క్తిక‌ట్టించేశాడు. ఇక మెయిన్ విల‌న్‌గా న‌టించిన ర‌వికిష‌న్ పాత్రానుగుణంగా కామెడీ పండించాడు. అతనికి తోడుగా ప్ర‌భాక‌ర్‌, అదుర్స్ ర‌ఘ కామెడీతో అల‌రించారు. సినిమాలో విల‌న్ గ్యాంగ్ కామెడీ న‌వ్విస్తుంది. ఇక టెక్నీషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే.. హీరోకి సిండ్రోమ్ ఉండ‌టం అనే పాయింట్‌మీద భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు వంటి సినిమాలు వ‌చ్చాయి. అవ‌న్నీ ఎంట‌ర్‌టైనింగే ప్ర‌ధానంగా తెరకెక్కాయి. కానీ సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ కంటే హీరోయిజంపైనే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి ఫోక‌స్ పెట్ట‌డంతో సినిమా అంతా క‌మర్షియ‌ల్ సినిమాను చూస్తున్న‌ట్లే ఉంటుంది. అనూప్ సంగీతం, నేప‌థ్య సంగీతం బాలేదు. యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం బావుంది. డిఫ‌రెంట్ పాయింట్‌తో తెర‌కెక్కిన రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీగా 90 ఎం.ఎల్ నిలిచింది.
చివ‌ర‌గా.. 90 ఎం.ఎల్‌.. సినిమాలో కిక్కు లేదు
రేటింగ్‌: 2/5

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment